AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్

దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. సమంత, నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇక విడిపోయిన తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నారు.

Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్
Samantha
Rajeev Rayala
|

Updated on: Sep 17, 2024 | 4:46 PM

Share

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది సమంత. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్‌గా మారిపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. సమంత, నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇక విడిపోయిన తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే సమంత మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది.

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

ఇదిలా ఉంటే సమంత గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో తనకు ఓ స్టార్ హీరో గురువు అని తెలిపింది సామ్. టాలీవుడ్ లో సమంత చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనూ సినిమా చేసింది సమంత.

ఇది కూడా చదవండి : Sunil Wife: సునీల్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమా చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా సామ్ నటించి మెప్పించింది. అలాగే గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పవన్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని సమంత తెలిపింది. అలాగే షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో సమంతను పవన్ ఆశీర్వదిస్తూ కనిపించారు. దీని గురించి సమంత మాట్లాడుతూ.. పవన్ నా గురువుగారు అని చెప్పింది. స్విట్జర్లాండ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సరదాగా తీసిన ఫోటో అది అని.. పవన్ కళ్యాణ్ నటుడు కాకపోయి ఉంటే నాకు గురువుగా ఉండమని కోరేదాన్ని అంటూ సమంత తెలిపింది. అలాగే ఆయన ఎవరినైనా తిట్టాలంటే కూడా చాలా మర్యాదగా తిట్టే వారని సమంత చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Pawan Kalyan

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు