AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: జానీ మాస్టర్ అరెస్ట్ వేళ నాగ బాబు షాకింగ్ ట్వీట్స్ .. విన్న ప్రతిదీ నిజమని నమ్మవద్దంటూ…

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకొన్న SoT పోలీసులు అతనిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ కేసుపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు.

Jani Master: జానీ మాస్టర్ అరెస్ట్ వేళ నాగ బాబు షాకింగ్ ట్వీట్స్ .. విన్న ప్రతిదీ నిజమని నమ్మవద్దంటూ...
Jani Master, Naga Babu
Basha Shek
|

Updated on: Sep 19, 2024 | 2:26 PM

Share

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకొన్న SoT పోలీసులు అతనిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ కేసుపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. అదే సమయంలో ఆరోపణలు ప్రూవ్ చేయకుండా ఒక వ్యక్తిని నిందించడం సరికాదంటూ కొందరు జానీ మాస్టర్ కు మద్దతు పలుకుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు జానీ మాస్టర్ కేసుపై స్పందించాడు. జానీ పేరు డైరెక్టుగా చెప్పకపోయినప్పటికీ ఈ వ్యవహారంపై వరుసగా ట్వీట్స్ చేశారు మెగా బ్రదర్. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి. మొదటి పోస్ట్ లో ‘ మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి. ప్రతి కథలోనూ మూడు వెర్షన్‌లు ఉంటాయి. మీ వైపు, నా వైపు, నిజం’ అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను నాగ బాబు షేర్ చేశారు.

అంతకు ముందు ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’ అని బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో చెప్పిన కొటేషన్‌ను కూడా నాగ బాబు షేర్ చేశాడు. అయితే ఈ రెండు ట్వీట్స్ లో ఎక్కడా జానీ మాస్టర్ పేరు ప్రస్తావించలేదు నాగ బాబు. అయితే వీటి అర్థాలు, సందర్భాన్ని బట్టి చూస్తే జానీ మాస్టర్ కోసమే ఈ ట్వీట్స్ చేసినట్లు ఉంది.

ఇవి కూడా చదవండి

నాగ బాబు ట్వీట్..

మరోవైపు జానీ మాస్టర్ అరెస్ట్ వ్యవహారంపై నార్సింగి పోలీస్ స్టేషన్ కు వచ్చింది అతని భార్య అయేషా. కాగా జానీ మాస్టర్ భార్య ను సైతం తన పై దాడికి పాల్పడిందని ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాగా నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద కొరియోగ్రాఫర్ జానీ భార్య అయేషా చిందులు వేసింది. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి వివరాలు అడగడానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నం చేయగా, తనకే కెమెరా పెడతారా మీపై కేసులు పెడతానంటూ బెదిరించింది అయేషా.

జానీ మాస్టర్ పేరు చెప్పకుండానే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.