Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్.. హీరో మంచు మనోజ్ ఏమన్నాడంటే?

లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు అతనిని హైదరాబాద్ తరలిస్తున్నారు. మరికాసేపట్లో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారని తెలుస్తోంది.

Jani Master: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్.. హీరో మంచు మనోజ్ ఏమన్నాడంటే?
Manchu Manoj, Jani Master
Follow us
Basha Shek

|

Updated on: Sep 19, 2024 | 4:13 PM

లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటోన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు అతనిని హైదరాబాద్ తరలిస్తున్నారు. మరికాసేపట్లో జానీ మాస్టర్ ను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు, అరెస్ట్ కావడంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ట్విట్టర్ లో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు మనోజ్.. ‘ జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీస్‌, బెంగళూరు నగర పోలీస్‌లకు నా అభినందనలు. ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. నిజాన్ని ఎదుర్కొండి. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. మీరు తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి’ అని హితవు పలికాడు మనోజ్.

‘ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ని వెంటనే సిద్ధం చేయాలని ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌)ను కోరుతున్నా. దీనికంటూ ప్రత్యేకంగా సోషల్‌మీడియా అకౌంట్స్ ఏర్పాటు చేయండి. మన సినిమా పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలవండి. తాము ఒంటరిగా లేమని.. తమ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన సినిమా పరిశ్రమ పెద్దలకు నా మద్దతు తెలియజేస్తున్నాను. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధంగా మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం’ అని మనోజ్‌ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో