Bigg Boss 8 Telugu:’మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. దయచేసి తనను బద్నాం చేయకండి’: సోనియా పేరెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సోనియా ఆకుల ఒకరు. బిగ్ బాస్ కు పలు సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి సోనియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులను గెల్చుకుంటుంది

Bigg Boss 8 Telugu:'మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది.. దయచేసి తనను బద్నాం చేయకండి': సోనియా పేరెంట్స్
Sonia Akula
Follow us
Basha Shek

|

Updated on: Sep 22, 2024 | 8:28 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కు సంబంధించి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో సోనియా ఆకుల ఒకరు. బిగ్ బాస్ కు పలు సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచి సోనియా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులను గెల్చుకుంటుంది. అయితే ఏ కంటెస్టెంట్ కైనా సోషల్ మీడియా ట్రోలింగ్ తప్పదు. ఇప్పుడు సోనియా విషయంలోనూ అదే జరుగుతోంది. కొంద మంది నెటిజన్లు ఆమెను అదే పనిగా టార్గెట్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సోనియాతో హౌస్ లో చనువుగా ఉంటోన్న నిఖిల్, పృథ్వీలతో ఆమెకు రిలేషన్ అంటగడుతున్నారు. తాజాగా సోనియాపై జరుగుతోన్న ట్రోలింగ్ పై ఆమె తల్లిదండ్రులు స్పందిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైన మల్లీశ్వరి- చక్రపాణి తమ కూతురిని బద్నాం చేయవద్దని వేడుకున్నారు.’బిగ్ బాస్ లో మా అమ్మాయి బాగా ఆడుతోంది. అయినా కొందరు తననే టార్గెట్‌ చేస్తున్నారు. మా అమ్మాయిని ఎందుకలా బద్నాం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి ఎన్ జీవోను స్థాపించి ఎంతోమందికి సాయం చేసింది.అలా వచ్చిన పేరుతోనే సినిమా అవకాశాలు వచ్చాయి. ఇదే క్రమంలో బిగ్‌బాస్‌ ఆఫర్‌ కూడా అందుకుంది. అయితే ఇప్పుడు ఈ ట్రోలింగ్‌ చూస్తుంటే.. నా కూతురు సంపాదించుకున్న మంచి పేరు పోతుందేమోనని బాధగా ఉంది’

ఇవి కూడా చదవండి

‘సోనియా నిఖిల్‌, పృథ్వీలను పెద్దన్నయ్య, చిన్నన్నయ్యలా ఫీలవుతోంది. అందుకే పెద్దోడు, చిన్నోడు అంటూ చనువుగా పిలుస్తోంది. కానీ దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఇది ఏ మాత్రం కరెక్ట్‌ కాదు. తను బిగ్‌బాస్‌ టైటిల్ గెలుస్తుందన్న నమ్మకముంది. ఆడవారికి ఆడవారే శత్రువు అన్నట్లు హౌస్‌లో ఉన్న మిగతా లేడీ కంటెస్టెంట్స్ కూడా నా కూతురి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి సమయంలో నిఖిల్‌, పృథ్వీ అయినా అన్నలా తోడున్నందుకు సంతోషంగా ఉంది. మా అమ్మాయి తన ఆటతో మున్ముందు అందరి నోళ్లు మూయిస్తుంది’

ఆడదానికి ఆడదే శత్రువు..

‘ మా అమ్మాయికి ఎలాంట లవ్‌ ఎఫైర్స్‌ లేవు. తనకు ఆల్‌రెడీ పెళ్లి ఫిక్సయిపోయింది. డిసెంబర్‌లోనే వివాహం కూడ జరగనుంది. తనకు కాబోయే అత్తామామల అంగీకారంతోనే బిగ్‌బాస్‌ షోకి వచ్చింది. ఇలాంటి సమయంలో మా కూతురిని ఇంత బద్నాం చేయొద్దు. తను ఐదుగురు అనాథ పిల్లలను చదివిస్తోంది. ఇంకా 50 మంది అనాథలను చదివించాలని తను తాపత్రయడుతోంది. అది అర్థం చేసుకోండి’ అని వేడుకున్నారు సోనియా తల్లిదండ్రులు.

డిసెంబర్ లోనే పెళ్లి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.