Bigg Boss 8 Telugu: మూడు వారాలకే సూట్ కేస్ సర్దిన సిద్దిపేట పోరడు.. బిగ్‌ బాస్ ద్వారా అభయ్ ఎంత సంపాదించాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మరో వారం గడిచిపోయింది. అందరూ ఊహించినట్లుగానే మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ను బండ బూతులు తిట్టిన అతనిపై హోస్ట్ నాగార్జన కూడా ఫైరయ్యారు. రెడ్ కార్డ్ చూపించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లమన్నారు. దీంతో శనివారమే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడని చాలా మంది భావించారు

Bigg Boss 8 Telugu: మూడు వారాలకే సూట్ కేస్ సర్దిన సిద్దిపేట పోరడు.. బిగ్‌ బాస్ ద్వారా అభయ్ ఎంత సంపాదించాడంటే?
Abhay Naveen
Follow us
Basha Shek

|

Updated on: Sep 23, 2024 | 8:58 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మరో వారం గడిచిపోయింది. అందరూ ఊహించినట్లుగానే మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ను బండ బూతులు తిట్టిన అతనిపై హోస్ట్ నాగార్జన కూడా ఫైరయ్యారు. రెడ్ కార్డ్ చూపించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లమన్నారు. దీంతో శనివారమే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడని చాలా మంది భావించారు. అయితే తోటి కంటెస్టెంట్లు ప్రాధేయ పడడం, చివరకు నాగార్జున రిక్వెస్ట్ చేయగా బిగ్ బాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అది ఒక్కరోజుకు మాత్రమే. శనివారం సేఫ్ అయిన అభయ్ నవీన ఆదివారం మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఓటింగ్ తక్కువగా ఉండడంతో అభయ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఎనిమిదో సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభయ్ నవీన్ సరిగ్గా మూడు వారాలకే బ్యాగ్ సర్దేసుకున్నాడు. కాగా షో ప్రారంభంలో అభయ్ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చాలా మంది భావించారు. కానీ అతను ఏ మాత్రం ఎఫెక్టివ్ గా గేమ్ ఆడలేకపోయాడు. టాస్కులు, గేముల్లోనూ పూర్తిగా డల్ అయిపోయాడు.

దీనికి తోడు మూడో వారం గొప్పలకు పోయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. చివరకు అదే కొంప ముంచిది. వీటన్నిటి కంటే ముఖ్యంగ కంటెస్టెంట్ల మీద కోపాన్ని బిగ్‌బాస్‌ మీద. బిగ్‌బాస్‌ కాదు బయాస​్‌డ్‌ అంటూ నానా బూతులు తిట్టాడు. ఇది నాగార్జునతో పాటు బిగ్ బాస్ కు కూడా కోపాన్ని తెప్పించింది. ఫలితంగా మూడు వారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటు వచ్చేశాడు అభయ్.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌస్ లో అభయ్ నవీన్..

అయితే మూడు వారాలకే హౌస్ నుంచి వెళ్లిపోయినా అభయ్ నవీన్ కు భారీగానే పారితోషకం అందిందని సమాచారం. హౌస్ లో ఉన్నందుకు గాను రోజుకు రూ. 28,571, వారానికి రెండు లక్షల రెమ్యునరేషన అందుకున్నాడని సమాచారం. అలా మూడు వారాలకు గానూ ఇతనికి రూ.6లక్షల రెమ్యూనిరేషన్ అందనుందని తెలుస్తోంది.

సెల్ఫ్ నామినేట్ అయ్యి చేజేతులా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.