Brahmamudi, September 23rd Episode: కావ్యని కారుతో గుద్దేసిన రాజ్.. పూజకి ఇంటికి వచ్చిన కళావతి!

గణపతిని అందంగా రెడీ చేస్తూ రంగులు వేస్తుంది కావ్య. ఎందుకు అమ్మా.. ఇంత లేటు అయిపోయింది.. ఇప్పుడు రంగులు వేయడం అవసరమా.. తెల్లవారు చూసుకోవచ్చు కదా.. అయినా తొండం కుడి వైపు ఉన్న వినాయకుడు కావాలి అనుకోవడం ఏంటమ్మా అని కృష్ణమూర్తి అంటాడు. పుణ్యం, మోక్షం కావాలని అనుకునేవారు కుడిపైపు దండం కావాలని కోరుకుంటారని కావ్య వివరించి చెబుతుంది కావ్య. ఈ వినాయకుడికి రంగులు వేయడానికి ఆ దుగ్గిరాల ఇంట అడుగు పెట్టావు. ఇప్పుడు ఈ వినాయకుడు అయినా మిమ్మల్ని..

Brahmamudi, September 23rd Episode: కావ్యని కారుతో గుద్దేసిన రాజ్.. పూజకి ఇంటికి వచ్చిన కళావతి!
BrahmamudiImage Credit source: disney hot star
Follow us

|

Updated on: Sep 23, 2024 | 12:16 PM

గణపతిని అందంగా రెడీ చేస్తూ రంగులు వేస్తుంది కావ్య. ఎందుకు అమ్మా.. ఇంత లేటు అయిపోయింది.. ఇప్పుడు రంగులు వేయడం అవసరమా.. తెల్లవారు చూసుకోవచ్చు కదా.. అయినా తొండం కుడి వైపు ఉన్న వినాయకుడు కావాలి అనుకోవడం ఏంటమ్మా అని కృష్ణమూర్తి అంటాడు. పుణ్యం, మోక్షం కావాలని అనుకునేవారు కుడిపైపు దండం కావాలని కోరుకుంటారని కావ్య వివరించి చెబుతుంది కావ్య. ఈ వినాయకుడికి రంగులు వేయడానికి ఆ దుగ్గిరాల ఇంట అడుగు పెట్టావు. ఇప్పుడు ఈ వినాయకుడు అయినా మిమ్మల్ని కలుపుతాడని అనుకుంటున్నా అని కృష్ణమూర్తి అనేసి వెళ్తాడు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ సమావేశమవుతారు. ఏంటి అందరూ కలిసి కళావతిని తీసుకురమ్మని ఆర్డర్ వేస్తారా అని రాజ్ అనుకుంటూ.. ఏంటి తాతయ్య పిలిచారు అని అడుగుతాడు. రేపు వినాయక చవితి అన్న విషయం గుర్తుందా.. ఏం జరుగుతుంది? అని సీతారామయ్య అంటాడు. ఆ మహా తల్లి వెళ్లిపోయిందని అందరూ దిగులుగా ఉన్నారు. ఈ పండుగ జరుపుకోవాల్సిందే కదా అని రుద్రాణి అంటుంది. ఇంట్లో పరిస్థితులు బాగోలేదు కదా నాన్నా అందుకే అని సుభాష్ అంటాడు.

రాజ్‌కు అపర్ణ వార్నింగ్..

సంతోషంగా ఉన్నప్పుడే కాదు.. కష్టాలు.. నష్టాలు.. సమస్యలు ఉన్నప్పుడే ఆ దేవుడిని పూజించాలి. అప్పుడే మనకు మరింత ఆనందం దక్కుతుందని పెద్దాయన అంటాడు. మీ నాన్న గారు చెప్పింది అందరూ విన్నారు కదా.. ఈ సారి వినాయకుడి పూజకు సంబంధించి అన్ని పనులు రాజ్ చేత జరిపించాలని ఇందిరా దేవి అంటుంది. మంచి విగ్రహం తీసుకురమ్మని చెప్తుంది. ఇక అందరూ వెళ్లిపోతారు. రాజ్ ఆలోచనలో పడతాడు. రాజ్.. ఈ పూజ నువ్వు జరిపిస్తే ఎక్కడ తనంతట తాను నడిచి వస్తుందని భయపడుతున్నావా.. అంతగా భయ పడదు. నా కోడలికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. నీలాంటి వాళ్ల కోసం ఆత్మాభిమానం చంపుకుని తిరిగి రాదని అపర్ణ అని వెళ్తుంది.

కూచి, పొట్టిల వినాయక పండగ..

మన పెళ్లి అయిన తర్వాత వచ్చే మొదటి పండుగ ఇది. కాబట్టి పూజకు కావాల్సినవన్నీ, విగ్రహం తీసుకొస్తానని కళ్యాణ్ అంటాడు. విగ్రహం నువ్వు తీసుకు రావడం ఏంటి? మా నాన్న చిన్నప్పటి నుంచి విగ్రహం తయారు చేస్తున్నాడు. ఎలా చేస్తారో నేను చిన్నప్పటి నుంచి చూశాను. నేనే తయారు చేస్తానని అంటుంది అప్పూ. అవునా సరే ఎలా చేస్తావో నేనూ చూస్తానని కళ్యాణ్ అంటాడు. ఇక అప్పూ మట్టి తీసుకుని ఎంత చేసినా రాదు. దీంతో నవ్వుతూ.. సరేలే వెళ్లి నేనే విగ్రహాన్ని తీసుకొస్తానని కళ్యాణ్ అంటాడు. అప్పుడే బంటీ వచ్చి.. మీరేం కష్ట పడాల్సిన పని లేదు. మీ కోసం పెదనాన్న విగ్రహం పంపించాడని చెప్తాడు. సరే వెళ్లు పూజ చేయాలని అప్పూ అంటే.. నాకు పూజ చేయడం రాదు.. నాకూ రాదని ఇద్దరూ అనుకుంటారు. సరిపోయింది.. నాకు వచ్చులే కానీ మీరు వెళ్లి అన్నీ తయారు చేయమని బంటీ అంటాడు.

ఇవి కూడా చదవండి

వినాయకుడిని చూసి మురిసిపోయిన కళావతి..

ఆ తర్వాత కావ్య విగ్రహాన్ని తీసుకొచ్చి.. విగ్రహాలు అమ్మే అతనికి ఇస్తుంది. అక్కడ వినాయకుడిని చూసి మురిసి పోతుంది. తొండాన్ని కుడి వైపుకు తిప్పానని ఏమీ అనుకోకు.. పాపం కష్టమర్ మోక్షం కోరుకుంటున్నాడేమో.. ఎక్కడి నుంచే తెచ్చిన బంక మట్టితో మా ఇంట్లో రూపు దిద్దుకున్నావు. ఇప్పుడు ఏ ఇంటికో వెళ్తున్నావు. ఆ ఇంటికి మంచి చేయి. క్షేమంగా.. భద్రంగా వెళ్లమని కావ్య అంటుంది. ఆ విగ్రహం చూసిన విగ్రహాలు అమ్మే అతను ఆహా.. జీవకళ ఉట్టి పడుతుంది. చాలా బాగుందని అంటాడు. ఎందుకో తెలీదు ప్రత్యేకంగా చేయాలని అనిపించింది. అందుకే చేశానని కావ్య అంటుంది. ఇక అతను డబ్బులు ఇస్తాడు. అప్పుడే కస్టమర్‌కి కాల్ చేసి.. కుడివైపు ఉన్న విగ్రహం కావాలి అన్నారు కదా.. తీసుకోవడానికి రమ్మని చెప్తాడు.

కావ్యని కారుతో గుద్దిన రాజ్..

ఇక కావ్య సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంది. అటువైపు రాజ్ కూడా కారులో వస్తూ కావ్యని గుద్దేస్తాడు. ఇక ఇద్దరూ ఎదురు పడగా.. అప్పుడే రాజ్, కావ్యలు మొదటి సారి ఎదురు పడిన సీన్ గుర్తుకు వస్తుంది. కావ్యని చూసి సెంటర్‌లో శిలా విగ్రహంలా ఆ చెయ్యి ఏంటి దించమని రాజ్ అంటాడు. చూసుకుని కారు నడపాలని తెలీదా? మీరు కావాలనే గుద్దారు. మీరు నా మీద మర్డర్ అటెమ్ట్ చేశారు. ఒక చెక్కు రాసిస్తే రాను అన్నానని.. ఈ రకంగా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారా అని కావ్య అంటుంది. ఇంకెందుకు అరువు.. అందర్నీ పోగేసి నా పరువు తీసి.. నేను పర్సులో నుంచి డబ్బులు తీసేలా చేయి.. ఏరి నీ సానుభూతుల పరులు ఏరి అని రాజ్ గట్టిగా అరుస్తాడు. ఈ డబ్బు ఉందన్న పొగరు చూపించినందుకే ఆ రోజు అంత గొడవ జరిగింది. కట్టుకున్న పెళ్లాం.. కట్టుబట్టలతో బయటకు వెళ్తుంటే.. చోద్యం చూస్తూ నిలబడ్డారు మీ వాళ్లు. నేను బయట దాన్ని.. పరాయి దాన్ని.. డబ్బులు వసూలు చేయడం కోసం తల పెట్టానని కావ్య అంటుంది.

ఒకరినొకరు దారఉణంగా తిట్టుకున్న కావ్య, రాజ్‌లు..

వీళ్లు భార్యాభర్తలలా ఉన్నారు. గొడవ పడి విడిపోయినట్టు ఉన్నారని అందరూ వెళ్తారు. కావ్యకి నాకూ సంబంధం లేదని రాజ్ అంటాడు. మీకూ నాకూ ఎలాంటి సంబంధం లేదా.. ఈ తాళి కట్టింది.. ఈ పుడింగి ఎవరు? అని కావ్య అడుగుతుంది. ఆ రోజు ముసుగులో ఉంది నువ్వు అని తెలిసి ఉంటే తాళి కట్టేవాడిని కాదు.. ఆ రోజు మా స్వప్నఅక్క వెళ్లకపోయి ఉంటే.. నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదని వెళ్లిపోయేదానిని అని కావ్య సమాధానం ఇస్తుంది. ఇప్పుడు ఏంటి? నీకేం కావాలి? ఈ డొక్కులో సైకిల్ కొని ఇవ్వాలా? అంటూ రాజ్, కావ్యలు ఇద్దరూ దారుణంగా తిట్టుకుంటారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..