AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్ బాస్‌లోకి నమ్రతా సిస్టర్.. హౌస్‌లో సందడి చేసేందుకు సిద్ధమైన ఒకప్పటి స్టార్ హీరోయిన్

బిగ్‌బాస్‌ రియాలిటీ షోస్‌ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు అమితమైన వినోదాన్ని అందించడంలో ఈ రియాలిటీ షోస్ ముందుంటాయి. ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు పేరుకు పేరు, డబ్బు, పాపులారిటీ కూడా పెరుగుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్‌ షోస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి.

Bigg Boss: బిగ్ బాస్‌లోకి నమ్రతా సిస్టర్.. హౌస్‌లో సందడి చేసేందుకు సిద్ధమైన ఒకప్పటి స్టార్ హీరోయిన్
Mahesh Babu Family
Basha Shek
|

Updated on: Sep 23, 2024 | 5:37 PM

Share

బిగ్‌బాస్‌ రియాలిటీ షోస్‌ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు అమితమైన వినోదాన్ని అందించడంలో ఈ రియాలిటీ షోస్ ముందుంటాయి. ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు పేరుకు పేరు, డబ్బు, పాపులారిటీ కూడా పెరుగుతుంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో బిగ్‌బాస్‌ షోస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తుండగా త్వరలో హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ప్రారంభం కానుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖానే ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. బిగ్ బాస్ హిందీ కొత్త సీజన్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని టాక్. అలాగే ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా ఓ కొలిక్కివచ్చిందని సమాచారం. కాగా బిగ్ బాస్ హిందీ సీజన్ 18 లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో ప్రముఖ నటి శిల్ప శిరోద్కర్‌ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె మరెవరో కాదు మన టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ కు సోదరి. నమ్రతా లాగే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది శిల్ప. భ్రష్టాచార్‌(1989) సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టిన శిల్ప.. కిషన్‌ కన్హయ్య, త్రినేత్ర, హమ్‌, ఖుదా గవా, ఆంఖెన్‌, గోపి కిషన్‌, మృత్యునాద్‌, బేవఫ సనం ఇలా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మోహన్ బాబు సరసన బ్రహ్మ అనే సినిమాలో కథానాయికగా నటించింది.

కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది శిల్పా శిరోద్కర్. సుమారు పదేళ్ల తర్వాత మళ్లీ 2013లో బుల్లితెరపై అడుగు పెట్టింది. అయితే గత కొద్దికాలంగా సీరియల్స్ కు కూడా దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

ఇవి కూడా చదవండి

శిల్పా శిరోద్కర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

ఇప్పుడు శిల్పా శిరోద్కర్ బిగ్ బాస్ హిందీ సీజన్‌లో సందడి చేసేందుకు సిద్ధమైందని టాక్. బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించగా శిల్పా కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ఆమెతో పాటు నువ్వునేను మూవీ హీరోయిన్ అనితా కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ లో సందడి చేయనున్నట్లు సమాచారం.

మహేశ్, నమ్రతా లతో శిల్పా శిరోద్కర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..