ములక్కాయ నాటుకోడి కూర ఇలా చేస్తే.. ఇంట్లో అందరూ గిన్నెలు మీదే పడతారు
Prasanna Yadla
12 March 2026
Pic credit - Pixabay
ములక్కాయ నాటుకోడి మీ ఇంట్లో మీరు ట్రై చేసారా? ఈ కూరను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు.
ములక్కాయ నాటుకోడి
ఇది కొన్ని ఏరియాల్లో చాలా ఫేమస్. ఎందుకంటే ఇది అదిరిపోయే కాంబో కూర కాబట్టి
కొన్ని ఏరియాల్లో చాలా ఫేమస్
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఎలా తయారు చేయాలంటే?
250 గ్రాముల ములక్కాయ ముక్కలు , పెద్ద ఉల్లిపాయ, అర కిలో గ్రాములు నాటుకోడి ముక్కలు, 50 గ్రాములు పచ్చిమిర్చిని తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
మూడు పండు టొమాటోలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, మసాలా, నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్థాలు
ముందుగా నాటు కోడి ముక్కలు తీసుకుని ఉప్పు నీటిలో కడిగి ఒక గిన్నెలోకి లోకి తీసుకోవాలి. అలాగే, ములక్కాడ ముక్కలు కూడా తీసుకుని వేరే పాన్ లో బాగా ఉడికించండి.
స్టెప్ -1
ఆ మిశ్రమంలో పచ్చి మిర్చి, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నాటు కోడి ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మునక్కాడ ముక్కలు వేసి బాగా ఉడికించాలి.
స్టెప్ -2
నాటుకోడి ముక్కలు ఉడికిన తర్వాత కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ధనియాలు, మసాలా పొడులు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసి దించేయండి. అంతే వేడి వేడి ములక్కాడ చికెన్ రెడీ.