AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Laddu: : పవన్ కల్యాణ్‌పై విమర్శలు.. ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణుల మధ్య రాజుకున్న యుద్ధం

సుమారు మూడేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికలలో మంచు విష్ణు గెలిచి.. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు

Tirumala Laddu: : పవన్ కల్యాణ్‌పై విమర్శలు.. ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణుల మధ్య రాజుకున్న యుద్ధం
Manchu Vishnu Vs Prakash Raj
Basha Shek
|

Updated on: Sep 21, 2024 | 4:59 PM

Share

సుమారు మూడేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సాధారణ ఎన్నికలను తలపించేలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికలలో మంచు విష్ణు గెలిచి.. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో ప్రకాశ్ రాజ్ కూడా మళ్లీ తన సినిమాలతో బిజీగా మారిపోయారు. ఆలా కామ్‌గా ఎవరి పని వారు చేసుకుంటూ వెళుతున్న వీరు మళ్లీ మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం. ఇప్పుడిదే విషయంలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య యుద్ధం రాజుకుంది. ఇద్దరూ ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ గొడవ ఎలా మొదలైందంటే.. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఒక హిందూ ఐటీ విభాగం చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ పవన్ చేసిన పోస్ట్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు‌ను వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలి’ అని పవన్ పోస్ట్ పెట్టారు.

దీనికి స్పందించిన ప్రకాశ్ రాజ్.. డియర్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దయచేసి దీనిపై విచారణ జరిపించండి . ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించండి. అంతేకానీ, మీరు ప్రజలలో భయాందోళనలను పెంచి, దీన్నో జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మనదేశంలో మతపరమైన సమస్యలు చాలానే ఉన్నాయి (కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు)’ అని పవన్ ను విమర్శించారు.

ఇవి కూడా చదవండి

తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన వాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చాడు. ‘ ప్రకాశ్‌రాజ్‌గారూ.. దయచేసి మీరు అంతలా అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణ నిమిత్తం ఇలాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ సరిగ్గానే పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే.. మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ హద్దుల్లో మీరు ఉంటే మంచిది’ అని కౌంటర్ ఇచ్చారు.

పవన్ పై ప్రకాశ్ రాజ్ పోస్ట్..

ఇక మంచు విష్ణు ట్వీట్ పై ప్రకాశ్ రాజ్ స్పందించారు.. ‘సరే శివయ్యా (విష్ణు కన్నప్ప సినిమాలో నటిస్తన్నాడు).. ఈ విషయంలో నా అభిప్రాయం నాకు ఉంది.. నీ అభిప్రాయం నీకు ఉంది. గుర్తుపెట్టుకోండి #జస్ట్‌ ఆస్కింగ్ ‘ అని రిప్లై ఇచ్చారు. మరి ఈ ట్వీట్ వార్ ఇంతటితో ఆగుతుందా? లేక కంటిన్యూ అవుతుందో? చూడాలి.

ప్రకాశ్ రాజ్ కు మంచు విష్ణు కౌంటర్..

ప్రకాశ్ రాజ్ రిప్లై ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.