- Telugu News Photo Gallery Cinema photos Hero Akhil Akkineni Next Movie With Director Anil after Agent flop Telugu Heroes Photos
Akhil Akkineni: అఖిల్ ఎక్కడ.? అంత సైలెంట్‌గా అక్కినేని వారసుడు ఏం చేస్తున్నట్లు.!
అఖిల్ ఎక్కడ..? ఏజెంట్ తర్వాత ఈయనేం ప్లాన్ చేస్తున్నారు..? అంత సైలెంట్‌గా అక్కినేని వారసుడు ఏం చేస్తున్నట్లు..? ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళవుతున్నా.. సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు అఖిల్. అందుకే ఈ సారి లేటైనా ప్లానింగ్ పర్ఫెక్టుగా ఉండాలంటున్నారు. మరి దీనికోసం అయ్యగారు ఏం చేస్తున్నారు..? అఖిల్ ప్లానింగ్ ఎలా ఉంది..? ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా.. గజినిలా దండయాత్ర చేస్తున్నా.. బ్లాక్‌బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు.
Updated on: Sep 21, 2024 | 5:05 PM

అఖిల్ ఎక్కడ..? ఏజెంట్ తర్వాత ఈయనేం ప్లాన్ చేస్తున్నారు..? అంత సైలెంట్‌గా అక్కినేని వారసుడు ఏం చేస్తున్నట్లు..? ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళవుతున్నా.. సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు అఖిల్.

అందుకే ఈ సారి లేటైనా ప్లానింగ్ పర్ఫెక్టుగా ఉండాలంటున్నారు. మరి దీనికోసం అయ్యగారు ఏం చేస్తున్నారు..? అఖిల్ ప్లానింగ్ ఎలా ఉంది..?

ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా.. గజినిలా దండయాత్ర చేస్తున్నా.. బ్లాక్‌బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు. క్లాస్ మాస్ రొమాన్స్ అన్నీ ట్రై చేసినా ఏదీ వర్కవుట్ కాలేదు. ఏజెంట్‌తో అఖిల్ మార్కెట్ మరింత డౌన్ అయిపోయింది.

దాంతో ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మారిపోతున్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు ఒకేసారి ఓకే చేసారు అక్కినేని వారసుడు. సుజీత్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన అనిల్ అనే కొత్త దర్శకుడితో.. యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నారు.

పీరియాడిక్ ఫాంటసీ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు ధీర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్ర మేకింగ్ విషయంలో రాజమౌళి సలహాలు కూడా తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

ప్రస్తుతం ఈ చిత్రం కోసమే మేకోవర్ అవుతున్నారు అఖిల్. ఏజెంట్ ఫ్లాపైనా.. అఖిల్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేకపోయినా కథకు తగ్గట్లు భారీ బడ్జెట్‌తోనే ఈ చిత్రం రానుంది.

అందుకే ఈ సారి లేటైనా ప్లానింగ్ పర్ఫెక్టుగా ఉండాలంటున్నారు. మరి దీనికోసం అయ్యగారు ఏం చేస్తున్నారు..? అఖిల్ ప్లానింగ్ ఎలా ఉంది..?





























