- Telugu News Photo Gallery Cinema photos Heroine Anushka Shetty joins in her Next Movie Ghaati shooting with director krish jagarlamudi Telugu Actress Photos
Anushka Shetty: ఎట్టకేలకు షూటింగ్ కు వచ్చిన అనుష్క శెట్టి.! ఇన్ని రోజులు ఏమైంది.?
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు..? నటిస్తున్నారా లేదంటే సైలెంట్‌గా రిటైర్ అయిపోయారా..? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది.. అనుష్క సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు క్రేజ్ మాత్రం తగ్గదు.
Updated on: Sep 21, 2024 | 4:32 PM

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు..? నటిస్తున్నారా లేదంటే సైలెంట్‌గా రిటైర్ అయిపోయారా..?

స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది.. అనుష్క సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. సినిమాలు చేసినా చేయకపోయినా కొందరు హీరోయిన్లకు క్రేజ్ మాత్రం తగ్గదు.

అందులో అనుష్క కూడా ఉంటారు. కొన్నేళ్లుగా ఈమె రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోయినా స్వీటీ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెతో నటించడానికి స్టార్స్ ఆసక్తిగానే ఉన్నారు.

అయితే ఈమె మాత్రం బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో సినిమాలకు సైన్ చేయట్లేదు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత తెలుగులో క్రిష్‌తో ఘాటీ అనే సినిమా చేస్తున్నారు జేజమ్మ.

వేదం తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. మలయాళంలోనూ కథనర్ అనే సినిమా చేస్తున్నారు అనుష్క. ఈ చిత్ర షూట్ ఇప్పటికే చివరిదశకు వచ్చింది.

9వ శతాబ్దపు కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథే కథనర్ సినిమా. తాజాగా ఘాటీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు అనుష్క. హైదరాబాద్‌లోనే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్టింగ్స్ వేసారు.

ఇందులోనే ఈ సీనియర్ హీరోయిన్ జాయిన్ అయ్యారు. డిఫెరెంట్ కథతో తెరకెక్కుతుంది ఘాటీ చిత్రం. 2025లో ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు కథనర్‌లో అరుంధతి, భాగమతి తరహా పాత్ర చేస్తున్నారు అనుష్క.




