- Telugu News Photo Gallery Cinema photos Power Star Pawan Kalyan's Upcoming Movies Shooting in Update, sets in plan in Vijayawada Telugu Heroes Photos
Pawan Kalyan: ఒట్టు నమ్మండి.. పవన్ వస్తున్నాడు.! షూటింగ్ స్టార్ట్ అవుతుంది..
అనుమానాలు అవసరం లేదమ్మా.. ఈసారి పక్కా.. ఇక రాసి పెట్టుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు వస్తున్నారు. ముందు హరిహర వీరమల్లు.. ఆ తర్వాత ఓజి.. ఇలా లెక్కలేసుకుంటున్నారు పవర్ స్టార్. మరి పవన్ రాకను ఈ సారైనా నమ్మొచ్చా..? రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి.. డిప్యూటీ సిఎం కెమెరా ముందుకొస్తున్నారా..? పవన్ అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది.
Updated on: Sep 21, 2024 | 4:00 PM

అనుమానాలు అవసరం లేదమ్మా.. ఈసారి పక్కా.. ఇక రాసి పెట్టుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు వస్తున్నారు. ముందు హరిహర వీరమల్లు.. ఆ తర్వాత ఓజి.. ఇలా లెక్కలేసుకుంటున్నారు పవర్ స్టార్.

మరి పవన్ రాకను ఈ సారైనా నమ్మొచ్చా..? రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి.. డిప్యూటీ సిఎం కెమెరా ముందుకొస్తున్నారా..? పవన్ అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది.

మరో మూడు రోజుల్లోనే మొహానికి రంగేసుకోబోతున్నారు పవర్ స్టార్. సెప్టెంబర్ 23 నుంచి ఈయన షూటింగ్‌కు రానున్నారు.

కొన్ని నెలలుగా సినిమాలకి దూరంగా ఉన్న పవన్.. ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూట్‌కు రావడానికి ఒప్పుకున్నారు. ఈ షూటింగ్స్ విషయంలోనే ఆ మధ్య పవన్ కళ్యాణ్‌ను కలిసొచ్చారు దర్శక నిర్మాతలు.

డేట్స్ ఇస్తానని వాళ్లకు ఆయన హామీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23 నుంచి వీరమల్లు కోసం కదులుతున్నారు పవన్. ఈ సినిమాతో పాటే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ఓజి షూటింగ్ జరగనుందని తెలుస్తుంది.

షూట్ అంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే జరగనుంది. డేట్స్ ఇస్తాను కానీ.. తానున్న బిజీలో లొకేషన్స్ తిరగడం అయ్యేపని కాదని.. అందుకే ఏ షూటింగ్ అయినా విజయవాడ నుంచే జరగాలని ఆయన కోరినట్లు తెలుస్తుంది.

దర్శక నిర్మాతలు కూడా దీనికి ఓకే చెప్పారు. వీరమల్లు, ఓజి తర్వాతే.. జనవరి నుంచి ఉస్తాద్ మొదలయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి పవన్ వస్తుండటంతో.. పండగ చేసుకుంటున్నారు మేకర్స్.




