- Telugu News Photo Gallery Cinema photos Sukumar wife Thabitha Bandreddi celebrates her birthday in Greece, Shares photos
Thabitha Sukumar: గ్రీస్‌లో సుకుమార్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ చూశారా?
ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత బండ్రెడ్డి బయట ఎక్కువగా కనిపించదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఇటీవల తబిత సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Updated on: Sep 21, 2024 | 3:58 PM

ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత బండ్రెడ్డి బయట ఎక్కువగా కనిపించదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఇటీవల తబిత సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

శనివారం (సెప్టెంబర్ 21) తబితా సుకుమార్ పుట్టిన రోజు. కాగా తన భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం సుకుమార్ గ్రీస్ వెళ్లారు. పిల్లలు కూడా వీరి వెంట ఉన్నారు.

పుట్టినరోజు సందర్భంగా చీర కట్టి గ్రీస్ వీధుల్లో సందడి చేసింది తబితా సుకుమార్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా కామన్ ఫ్రెండ్స్ ద్వారా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా గురించి తెలుసుకొని, స్పెషల్ షో వేసుకుని చూశారట తబితా సుకుమార్. ఆ సినిమా విపరీతంగా నచ్చసిందట.

దీంతో దగ్గరుండి మరీ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రచార కార్యక్రమాలు నిర్వహించారట తబిత. తద్వారా ప్రేక్షకులకు తన సినిమా గురించి తెలిసేలా చేశారట.

రావు రమేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.