Tollywood:ఫైరింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్..ఇప్పుడు టాలీవుడ్ అందాల యాంకరమ్మ.. బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా..
ముఖ్యంగా ఓ మేల్ యాంకర్ తో కలిసి ఆమె చేసిన టీవీ షోలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక బుల్లితెర ప్రేక్షుకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసిందీ అందాల తార. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ హౌస్ లో ఉన్నన్ని రోజులు తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది
పై ఫొటోలో ఎన్‌సీసీ డ్రెస్ లో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఫైరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ కూడా అయిన ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా ఫేమస్. తన చలాకీ మాటలతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఓ మేల్ యాంకర్ తో కలిసి ఆమె చేసిన టీవీ షోలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక బుల్లితెర ప్రేక్షుకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసిందీ అందాల తార. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఈ బ్యూటీ హౌస్ లో ఉన్నన్ని రోజులు తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది. విజేతగా నిలవకపోయినా కూల్ కంటెస్టెంట్ గ బుల్లితెర ఆడియెన్స్ మన్ననలు అందుకుంది. అయితే గత కొన్నేళ్లుగా ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదీ అందాల యాంకరమ్మ. మొత్తం తన సమయాన్ని ఫ్యామిలీ లైఫ్‌కే కేటాయిస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసింది. తన పిల్లలు, భర్తతో కలిసి వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటోంది. మరి ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఏనుగు, చీమ జోకులతో బాగా ఫేమస్ అయ్యిందీ స్టార్ యాంకర్. అలాగే యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన టీవీ షోలు కూడా సూపర్ హిట్. ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు యాంకర్ లాస్య
బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది యాంకర్ లాస్య. అదే సందర్భంలో ఆమె పర్సనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాస్య అసలు పేరు సౌజన్యా రెడ్డి ఆట. ఎన్ సీసీలోనూ ఆమె ట్రైనింగ్ తీసుకుందట. అంతేకాదు ఫైరింగ్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించిందట.
లాస్య లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
టీవీ షోల సంగతి పక్కన పెడితే.. లాస్యది ప్రేమ వివాహ. మంజునాథ్ తో కలిసి ఆమె 2017లోపెళ్లిపీటలెక్కింది. వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ లవ్లీ కపుల్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇద్దరు కుమారులతో యాంకర్ లాస్య..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.