Bigg Boss 8 Telugu Elimination: అనుకున్నదే జరిగిందిగా.. బయటకు వచ్చేది అతడే.. ఎలిమినేట్ ఎవరంటే..
ఎగ్స్ టాస్కులో అదరగొట్టిన అమ్మాయిలను అభినందించాడు. అలాగే నోరు జారిన ప్రేరణ, విష్ణుప్రియకు క్లాస్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత అనవసరంగా హగ్స్ ఇవ్వడంతో యష్మి ఇబ్బంది పడుతుందని.. మరోసారి ఇలా ఇబ్బంది పెడితే బయటకు పంపిస్తానని మణికంఠకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగ్. అలాగే బిగ్బాస్ ను ఇష్టమొచ్చినట్లు తిట్టిన అభయ్ నవీన్ కు రెడ్ కార్డ్ చూపించాడు. వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని సీరియస్ అయ్యాడు.
బిగ్బాస్ మూడో వారం ఎలిమినేషన్ సమయం వచ్చింది. ఈ వారం మొత్తం హౌస్మేట్స్ ప్రవర్తన, ఆట తీరుపై శనివారం ఎపిసోడ్ లో ఇచ్చిపడేశాడు నాగార్జున. ఎగ్స్ టాస్కులో అదరగొట్టిన అమ్మాయిలను అభినందించాడు. అలాగే నోరు జారిన ప్రేరణ, విష్ణుప్రియకు క్లాస్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత అనవసరంగా హగ్స్ ఇవ్వడంతో యష్మి ఇబ్బంది పడుతుందని.. మరోసారి ఇలా ఇబ్బంది పెడితే బయటకు పంపిస్తానని మణికంఠకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగ్. అలాగే బిగ్బాస్ ను ఇష్టమొచ్చినట్లు తిట్టిన అభయ్ నవీన్ కు రెడ్ కార్డ్ చూపించాడు. వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని సీరియస్ అయ్యాడు. కానీ హౌస్మేట్స్ రిక్వెస్ట్ చేయడంతో అతడిని హౌస్ లో ఉండమన్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మూడో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. మరికొన్ని గంటల్లో ఎవరు ఎలిమినేట్ కానున్నారనే విషయం తెలియనుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి అభయ్ నవీన్ బయటకు రానున్నాడట.
మూడో వారం హౌస్ నుంచి అభయ్ ఎలిమినేట్ కానున్నాడనే ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే అసలు ఈ వారం మొత్తం డేంజర్ జోన్ లో పృథ్వీ, అభయ్ ఉన్నారు. ఎగ్స్ టీంలో అభయ్ వర్సెస్ నిఖిల్ టీం పోటీపడాల్సి ఉంది. కానీ ఈ టాస్కులో అభయ్ పూర్తిగా చేతులు ఎత్తేశాడు. టీమ్ కష్టపడి ఎగ్స్ సంపాదిస్తే జాగ్రత్తగా కాపాడకుండా చూస్తూ ఉండిపోయాడు. చీఫ్ గా ముందు ఉండి తన టీంను నడిపించాల్సిన అభయ్.. అసలు గేమ్ సంగతే మర్చిపోయి రిలాక్స్ అయ్యాడు. అటు టీం సభ్యులు, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలతో పోటీపడి మరీ గేమ్ ఆడుతుంటే నాకేం సంబంధం లేదన్నట్లుగా దూరంగా కూర్చున్నాడు. బుట్టల దగ్గర కూర్చొని ఎగ్స్ కూడా కాపాడలేకపోయాడు. దీంతో అటు అభయ్ తీరుపై టీం సభ్యులకు.. ఇటు ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
ఇక గేమ్ ఆడకుండా బిగ్బాస్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఉండడం కూడా అభయ్ కు మైనస్ అయ్యిందనే చెప్పాలి. నువ్వు బిగ్బాస్ కాదు.. బయాస్డ్ బాస్ అంటూ డైలాగ్స్ కొట్టాడు. అటు టాస్కులలో ఏమాత్రం ఎఫర్ట్ పెట్టకుండా రిలాక్స్ కావడం.. ఇటు బిగ్బాస్ పై మాటలతో రెచ్చిపోవడంతో అభయ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. నిజానికి తొలి వారం నుంచి అభయ్ నవీన్ నామినేషన్స్ లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ తొలిసారిగా నామినేట్ అయ్యాడు. కానీ ఇదే వారం అతడు టాస్కులో సరిగ్గా పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో అతడికి అంతగా ఓటింగ్ కూడా రానట్లుగా తెలుస్తోంది. మూడో వారం ఓటింగ్ లో అభయ్ చివరి స్థానంలో ఉన్నాడని.. ఈ వారం అతడే ఎలిమినేట్ కానున్నాడని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.