Hunt OTT: ఊహించని ట్విస్టులతో మలయాళం హారర్ మూవీ.. ఒక్కో సీన్ మైండ్ బ్లాంక్ అంతే.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ చేస్తోంది. ఇప్పటివరకు కేస్ ఆఫ్ కొండన్న, రెయిన్ ది రియల్ స్టోరీ, గోవిందా గోవిందా చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం కథానాయికగా పింక్ నోట్, ఉత్తర కాండ చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె నటించిన హారర్ మూవీ ది హంట్. డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైంది.
ఒకే ఒక్క సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న హీరోయిన్ భావన. శ్రీకాంత్ నటించిన మహాత్మ సినిమాతో తెలుగులో ఈ భామకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత అంతగా హిట్స్ అందుకోలేదు. దీంతో ఇక్కడ ఆఫర్స్ తగ్గిపోవడంతో పూర్తిగా కన్నడ, మలయాళ భాషలకే పరిమితమైపోయింది. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ చేస్తోంది. ఇప్పటివరకు కేస్ ఆఫ్ కొండన్న, రెయిన్ ది రియల్ స్టోరీ, గోవిందా గోవిందా చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం కథానాయికగా పింక్ నోట్, ఉత్తర కాండ చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆమె నటించిన హారర్ మూవీ ది హంట్. డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైంది.
మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ అందుకుంది ఈ మూవీ. కానీ ఇందులో మరోసారి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ హారర్ సినీ ప్రియులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అందుబాటులోకి రానుంది. 2006లో విడుదలైన చింతామణి కోలాకేస్ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత భావన, డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబోలో వచ్చిన సినిమా ఇది.
కథ విషయానికి వస్తే..
డాక్టర్ కీర్తి (భావన) ఫోరెన్సిక్ డాక్టర్. ఓ మహిళా హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను కనిపెట్టే బాధ్యత ఆమెపై పడుతుంది. దీంతో ఆ కేసును ఇన్వేస్టిగేషన్ చేపట్టినప్పటి నుంచి కీర్తి జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓ ఆత్మ ఆమెను వెంటాడుతుంది. కీర్తి సహాయంతో ఆ ఆత్మ తన మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంది.. ? ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది ? కీర్తికి ఆ ఆత్మతో ఉన్న సంబంధం ఏంటీ ? అనేది సినిమా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.