Tollywood: ఓర్నీ.. ఈ చిన్నారి పాన్ ఇండియా హీరోయిన్.. ఇంకా స్టార్ హీరోకి కాబోయే భార్య.. ఎవరో గుర్తుపట్టండి..
తాజాగా ఓ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో తన తండ్రి పక్కనే టేబుల్ పై కూర్చొని అమాయకంగా చూస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు దేశం మెచ్చిన అమ్మాయి. తెలుగు, హిందీతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ అభిమానులకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తాయి. తమ ఫేవరేట్ స్టార్స్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు.. ? ఎక్కడ చదువుకున్నారు? అనే వివరాలు తెలుసుకోవడానికి అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఓ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో తన తండ్రి పక్కనే టేబుల్ పై కూర్చొని అమాయకంగా చూస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు దేశం మెచ్చిన అమ్మాయి. తెలుగు, హిందీతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అంతేకాదు.. త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? తనే హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.
శోభితా ధూళిపాళ్ల.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మోడలింగ్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ ఎర్త్ 2023 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆమె వెళ్ళింది. 2016లో, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0తో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విక్కీ కౌశల్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. హిందీలో సినిమా కెరీర్ ప్రారంభించినా సౌత్ ఇండియన్ సినిమాపై కూడా దృష్టి సారిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తుంది.
తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నీస్ సెల్వన్‌లో వనతి పాత్రను పోషించింది. ఇది ఆమెకు తొలి తమిళ చిత్రం. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్‌లో శోభితా ధూళిపాళ తన పాత్రతో మంచి ప్రశంసలు అందుకుంది. హిందీలో ప్రముఖ నటీనటులతో జోడీ కట్టిన శోభితా.. దుల్కర్ సల్మాన్ సరసన ‘గురుబ్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఈ బ్యూటీ ఇన్ స్టాలో చాలా యాక్టివ్. ఇందులో ఆమెకు 5.1మిలయన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.