AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ‘చిరంజీవి స్టెప్పులేస్తుంటే కళ్లు తిప్పుకోలేం’.. మెగాస్టార్‌ఫై ఆమిర్ ఖాన్ ప్రశంసలు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. ఆయనకు 'మోస్ట్ ప్రొఫైల్డ్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా' సర్టిఫికేట్ ప్రదానం చేశారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు. 45 ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న చిరంజీవి మొత్తం 156 సినిమాల్లో 537 పాటలకు గానూ 24 వేల డ్యాన్స్ స్టెప్పులు వేసి రికార్డు సృష్టించారు

Megastar Chiranjeevi: 'చిరంజీవి స్టెప్పులేస్తుంటే కళ్లు తిప్పుకోలేం'.. మెగాస్టార్‌ఫై ఆమిర్ ఖాన్ ప్రశంసలు
Aamir Khan, Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Sep 23, 2024 | 10:34 PM

Share

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. ఆయనకు ‘మోస్ట్ ప్రొఫైల్డ్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా’ సర్టిఫికేట్ ప్రదానం చేశారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు. 45 ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న చిరంజీవి మొత్తం 156 సినిమాల్లో 537 పాటలకు గానూ 24 వేల డ్యాన్స్ స్టెప్పులు వేసి రికార్డు సృష్టించారు. తన ప్రతిభకు ప్రతీకగానే ఆదివారం (సెప్టెంబర్ 23) ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఇదే వేదికపై ఉన్న ఆమిర్ఖాన్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ కు ఈ అవార్డును అందజేయడానికి ఆయన ముంబై వచ్చారు. అవార్డు ప్రదానం అనంతరం ఆయన చిరంజీవి గురించి మాట్లాడారు. ‘చిరంజీవిని నేను అన్నయ్యగా భావిస్తాను. నేను కూడా ఆయన అభిమానిని. చిరంజీవికి ఈ గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అభ్యర్థించారు. అడిగే బదులు మీరు నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పాను’.

‘ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో నేనూ భాగమవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి పాటను ఆస్వాదించి, డ్యాన్స్‌ చేస్తుంటారు చిరంజీవి. ఏదైనా ప్రాణం పెట్టేస్తారు. చిరంజీవి డ్యాన్స్‌ వేయడం చూస్తే కళ్లుతిప్పుకోలేం. చిరంజీవి సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అభిమానులను అలరించడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు’ అని ప్రశంసలు కురిపించారు ఆమిర్ ఖాన్. కాగా చాలా మంది దక్షిణాది హీరోలతో అమీర్ ఖాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అక్కినేని కుటుంబంతో అమీర్ ఖాన్ కు మంచి అనుబంధం ఏర్పడింది. గతంలో విడుదలైన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నాగ చైతన్య నటించాడు. ఆ సందర్భంగా అమీర్ ఖాన్ నాగ చైతన్య ఇంట్లో డిన్నర్ కూడా చేసాడు.

ఇవి కూడా చదవండి

గిన్నిస్ బుక్ ఈవెంట్ లో చిరంజీవి, ఆమిర్ ఖాన్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్