AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Prakash Raj: ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు..’ శ్రీవారి లడ్డూ వివాదంలో ప్రకాష్ రాజ్ మరో ట్వీట్‌

తిరుమల పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఏపీ రాష్ట్ర సర్కార్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యిని రిజెక్ట్ చేశారని టీటీడీ ఈవో చెప్పారు కదా? నెయ్యి రిజెక్ట్‌ చేశాక ఇక వాడే పరిస్థితి ఉండదు కదా అని ప్రభుత్వం తరుఫున లాయర్‌ను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు? మైసూర్‌ లేదంటే గజియాబాద్‌ ల్యాబ్‌ల నుంచి సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించింది..

Actor Prakash Raj: 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు..' శ్రీవారి లడ్డూ వివాదంలో ప్రకాష్ రాజ్ మరో ట్వీట్‌
Tirupati Laddu Row
Srilakshmi C
|

Updated on: Oct 01, 2024 | 2:44 PM

Share

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు వస్తుంటారు. ఇక్కడ మొక్కలు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దైవాన్ని దర్శించుకుని వెళ్తుంటారు. ఇక్కడ ఇచ్చే లడ్డూ ప్రసాదం పరమ పవిత్రంగా భావిస్తుంటారు భక్తులు. ఈ తరుణంలో కూటమి సర్కార్‌ వెంకన్న లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తిరుమల లడ్డూ కల్తీపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీవారి లడ్డూ వివాదంపై రాజకీయంగా పెద్ద దుమారం రేగింది.

దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఏపీ రాష్ట్ర సర్కార్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యిని రిజెక్ట్ చేశారని టీటీడీ ఈవో చెప్పారు కదా? రిజెక్ట్‌ చేశాక ఇక వాడే అవకాశం ఉండదు కదా అని ప్రభుత్వం తరుఫున లాయర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు? మైసూర్‌ లేదంటే గజియాబాద్‌ ల్యాబ్‌ల నుంచి సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత తయారైన లడ్డూలను టెస్టింగుకు పంపారా? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎలాంటి పూర్తి ఆధారాలు లేకుండా లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్టు ప్రభుత్వం ప్రకటన చేయడం సరికాదని సుప్రీంకోర్టు మండిపడింది. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా అంటూ వ్యాఖ్యానించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై రెండో ఒపీనియన్‌ తీసుకోకుండా నేరుగా మీడియా ముందుకు వెళ్లి ప్రకటనలు చేయడం సరికాదంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇరువాదనలు విన్న కోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని నేతలకు సూచించింది.

ఇవి కూడా చదవండి

సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలపై న‌టుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌ వేదిక‌గా స్పందించాడు. ‘దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి’ అంటూ #జస్ట్ ఆస్కింగ్, #జస్ట్‌ ప్లీడింగ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌లతో తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. ఇక ప్రకాశ్ రాజ్‌ పోస్టు మళ్లీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొంత కాలంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, నటుడు ప్రకాశ్‌రాజ్‌ మధ్య తిరుమల లడ్డూ వ్యవహారంలో డైలాగ్‌ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!