Bigg Boss 8 Telugu: కంటెస్టెంట్స్ మధ్య ‘మంట’ పెట్టిన బిగ్ బాస్.. ఐదో వారంలో నామినేషన్స్‌లో ఉన్నది వీరే!
సోమవారం వచ్చింది కాబట్టి బిగ్ బాస్ లో నామినేషన్ల పర్వం మొదలైంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈవారం తమకు నచ్చని కంటెస్టెంట్ల ఫొటోలను మంటల్లో వేసే కాన్సెప్ట్ తో నామినేషన్స్ సాగించాడు బిగ్ బాస్. ఈ వారం కూడా నాగ మణికంఠనే అందరికీ టార్గెట్ అయ్యాడు. ముఖ్యంగా కిర్రాక్ సీత అయితే మణిని ఓ రేంజ్ లో దుమ్ము దులిపేసింది.
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఐదో వారంలోకి అడుగు పెట్టింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా ఇప్పటికే నలుగురు బయటకు వెళ్లిపోయారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ మొదటి మూడు వారాల్లో ఎలిమినేట్ కాగా.. ఈ ఆదివారం (సెప్టెంబర్ 29) సోనియా ఆకుల హౌస్ నుంచి నిష్ర్కమించింది. దీంతో ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక సోమవారం వచ్చింది కాబట్టి బిగ్ బాస్ లో నామినేషన్ల పర్వం మొదలైంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఈవారం తమకు నచ్చని కంటెస్టెంట్ల ఫొటోలను మంటల్లో వేసే కాన్సెప్ట్ తో నామినేషన్స్ సాగించాడు బిగ్ బాస్. ఈ వారం కూడా నాగ మణికంఠనే అందరికీ టార్గెట్ అయ్యాడు. ముఖ్యంగా కిర్రాక్ సీత అయితే మణిని ఓ రేంజ్ లో దుమ్ము దులిపేసింది. ‘నీవెంత.. నీవెంత’ అంటూ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. వీరిద్దరి మధ్య హౌస్ లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆ తర్వాత మణికంఠ నైనికను నామినేట్ చేశాడు. ఆమె టాస్కుల్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయడం లేదంటూ నైనికపై ఓ రేంజ్ లో ఫైరయ్యాడు మణికంఠ.
మొత్తానికి ఈ వారం కూడా నామినేషన్స్ హోరాహోరీగానే సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్స్ షూటింగ్ పూర్తవగా ఎవరెవరు లిస్టులో ఉన్నారనేది బయటకొచ్చింది. ఈ వారం విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబీల్, మణికంఠ, నిఖిల్.. నామినేషన్స్‌లో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించాల్సిందే.
ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా..
🚨 Shocking news for Bigg Boss fans! The mid-week eviction is approaching, and the house is buzzing with speculation. Who do you think will be sent home this time? 🤔 Share your thoughts in the comments and don’t miss the drama! #BiggBossTelugu8 #StarMaa! pic.twitter.com/CfDdzt9oC0
— Starmaa (@StarMaa) September 30, 2024
కాగా ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయని చెప్పడంతో బిగ్ బాస్ షో మరింత రసవత్తరంగా మారనుంది.
బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.