Bigg Boss 8 Telugu: ఆదిత్యకు బిగ్బాస్ వార్నింగ్.. మణికంఠ వర్సెస్ యష్మి.. నామినేషన్లలో ఉన్నది వీరే..
తర్వాత నిఖిల్ ముందుగా విష్ణును నామినేట్ చేస్తూ ఆమె మాట్లాడే మాటలు ఇతరులను హర్ట్ చేస్తున్నాయని చెప్పాడు. దీంతో గట్టిగానే వాదించింది విష్ణు. రెండో నామినేషన్ మణికంఠకు వేస్తూ.. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో త్యాగం చేస్తున్న అని చెప్పి తర్వాత మాట మార్చవు.. ఫ్లిప్ అవుతున్నావంటూ రీజన్ చెప్పాడు. దీంతో కాసేపు ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది.
బిగ్బాస్ నాలుగో వారం సోనియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఐదో వారం కూడా నామినేషన్లలో కంటెస్టెంట్స్ మధ్య హీట్ డిస్కషన్స్ నడిచాయి. ఎప్పటిలాగే ఈ వారం హౌస్మేట్స్ అందరూ కలిసి మణికంఠను టార్గెట్ చేశారు. ఎక్కువ మంది మణిని నామినేట్ చేయడం గమనార్హం. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను మంటల్లో వేయాలని.. అందుకు గల రీజన్స్ చెప్పాలని అన్నాడు బిగ్బాస్. మొదటి వారంలో ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు లేవంటూ నైనికను నామినేట్ చేశాడు. అందుకు కవరింగ్ చేసే ప్రయత్నం చేసింది నైనిక. ఇక ఆ తర్వాత తన గురించి జోక్స్ చేయడం నచ్చలేదని.. నాగ్ సర్ ఫుటేజ్ చూపించిన తర్వాత తనకు అలా జోక్స్ చేయడం నచ్చలేదంటూ యష్మీని నామినేట్ చేశాడు. దీంతో మణికంఠ చెప్పిన రీజన్స్ కరెక్ట్ కాదంటూ కాసేపు వాదించింది యష్మీ.
ఇక తర్వాత నబీల్ గేమ్ సీరియస్ గా తీసుకోలేదంటూ నైనిక నామినేట్ చేసింది. అలాగే తనకు బాండింగ్ తగ్గిపోతుందని విష్ణును నామినేట్ చేసింది. అలాగే విష్ణుప్రియను నామినేట్ చేస్తూ గేమ్ ఆడాలానే ఫైర్ నీలో తగ్గిపోతుందని.. తొందరగా గివ్ అప్ ఇచ్చేస్తున్నావంటూ నబీల్ చెప్పాడు. ఫస్ట్ చూసినంత యాక్టివ్ గా ఇప్పుడు లేదంటూ నైనికను నామినేట్ చేశాడు. అలాగే ఆదిత్య తన ఫస్ట్ నామినేషన్ నైనికను చేస్తూ.. మన నిర్ణయమే మనమే తీసుకోవాలి.. కానీ అప్పుడప్పుడు మీరు వేరే ఒకరిని అడగడం చూశా అంటూ రీజన్ చెప్పాడు. అప్పుడు ఈజీగా వదిలేసే మాటలు వేరే వాళ్లను హర్ట్ చేస్తున్నాయంటూ చెప్పాడు ఆదిత్య. తర్వాత నిఖిల్ ముందుగా విష్ణును నామినేట్ చేస్తూ ఆమె మాట్లాడే మాటలు ఇతరులను హర్ట్ చేస్తున్నాయని చెప్పాడు. దీంతో గట్టిగానే వాదించింది విష్ణు. రెండో నామినేషన్ మణికంఠకు వేస్తూ.. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో త్యాగం చేస్తున్న అని చెప్పి తర్వాత మాట మార్చవు.. ఫ్లిప్ అవుతున్నావంటూ రీజన్ చెప్పాడు. దీంతో కాసేపు ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది.
ముందుగా మణికంఠను నామినేట్ చేసింది ప్రేరణ. ఆ తర్వాత ఆదిత్యకు కాన్ఫిడెన్స్ లేదంటూ నామినేట్ చేయగా.. మంటల్లో చేయి పెట్టి తన ఫోటో తీస్తు ఇది నా కాన్ఫిడెన్స్ అని అన్నాడు ఆదిత్య. దీంతో బిగ్ బాస్ రియాక్ట్ అవుతూ మంటల్లో చేతులు పెట్టడం ఆటలుగా అనిపిస్తుందా.. ఎవరూ ఇలాంటి పనులు చేయ్యొద్దని హెచ్చరిస్తున్నాం ఉంటూ వార్నింగ్ ఇచ్చాడు. నైనిక, నబీల్ ఇద్దరినీ నామినేట్ చేసింది విష్ణుప్రియ. యష్మీ ముందుగా మణికంఠను నామినేట్ చేస్తూ. నీ గురించి నాగార్జున సర్ ఎన్నిసార్లు వీడియో ప్లే చేయలేదు.. నువ్వు రియలైజ్ అయ్యి సారీ చెప్పావా.. కానీ నా తప్పు కాకపోయినా సారీ చెప్పాను.. నువ్వు చెప్పావా అంటూ క్వశ్చన్ చేసింది యష్మీ. అలా రియలైజ్ కాకపోతే నేను ఫస్ట్ వీక్ వెళ్లిపోయేవాడిని అంటూ మణికంఠ అనడంతో అసలు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావడం లేదంటూ రెచ్చిపోయింది యష్మీ. నువ్వు ఏమైనా అనుకో.. యూ బ్రోక్ మై హార్ట్ అంటూ యష్మీ డైలాగ్ కొట్టింది.
నా హార్ట్ బ్రేక్ చేశావ్ అని పదే పదే అనడంతో నీ హార్ట్ కిందేసి రుద్దుకో నాకేం సంబంధం లేదు అంటూ కౌంటరిచ్చాడు మణి. చివరిగా పృథ్వి వచ్చి ముందుగా నైనిక నామినేట్ చేశాడు. విష్ణుప్రియతో మీ ఫ్రెండ్ షిప్ బ్రేక్ చేయడానికి నైను ట్రై చేశాను అన్నారు.. అది నాకు నచ్చలేదంటూ రీజన్ చెప్పాడు. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేశాడు. చివరగా ఇద్దరూ చీఫ్స్ లో ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పగా.. నిఖిల్ ను నామినేట్ చేశారు.
నామినేషన్లలో ఉన్నది వీరే.. మణికంఠ విష్ణుప్రియ. నబీల్ ఆదిత్య నైనిక నిఖిల్