Brahmamudi, October 1st Episode: కావ్య వర్సెస్ రాజ్.. సంతోషంలో సామంత్, అనామికలు..

ఈ రోజను బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్ ఆటో నడపడం చూసి అప్పూ ఎంతో బాధ పడుతుంది. ఈ రోజు నువ్వు ఇంటికి వచ్చావో చచ్చావే అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అప్పూ అలా చూసినందుకు కళ్యాణ్ కూడా ఫీల్ అవుతాడు. మరోవైపు మంచి డిజైన్స్ వేయాలని రాజ్ రాత్రంతా ఆఫీస్‌లో మేల్కొని డిజైన్స్ గీస్తూ ఉంటాడు. ఇక ఆఫీస్‌లో స్టాఫ్ అందరూ వెళ్లిపోయినా శ్రుతి మాత్రం వెళ్లకుండా ఉంటుంది. ఇంకోవైపు కనకం వడ్డిస్తూ ఉండగా..

Brahmamudi, October 1st Episode: కావ్య వర్సెస్ రాజ్.. సంతోషంలో సామంత్, అనామికలు..
BrahmamudiImage Credit source: Disney Hot star
Follow us

|

Updated on: Oct 01, 2024 | 1:21 PM

ఈ రోజను బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్ ఆటో నడపడం చూసి అప్పూ ఎంతో బాధ పడుతుంది. ఈ రోజు నువ్వు ఇంటికి వచ్చావో చచ్చావే అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అప్పూ అలా చూసినందుకు కళ్యాణ్ కూడా ఫీల్ అవుతాడు. మరోవైపు మంచి డిజైన్స్ వేయాలని రాజ్ రాత్రంతా ఆఫీస్‌లో మేల్కొని డిజైన్స్ గీస్తూ ఉంటాడు. ఇక ఆఫీస్‌లో స్టాఫ్ అందరూ వెళ్లిపోయినా శ్రుతి మాత్రం వెళ్లకుండా ఉంటుంది. ఇంకోవైపు కనకం వడ్డిస్తూ ఉండగా.. కావ్య అన్నం తింటూ ఉంటుంది. అప్పుడే సామంత్ కంపెనీలో పని చేసే సురేష్ కాల్ చేస్తాడు. కావ్య గారు మీకు గుడ్ న్యూస్.. మీరు వేసిన డిజైన్స్ అన్నీ బాగున్నాయని అప్రూవల్ వచ్చింది. అలాగే రేపు జూబ్లిహిల్స్‌లో జరగబోయే ఎక్స్‌పోకి మన క్లయింట్స్ చాలా మంది వస్తారు. రేపు మీరు కూడా అక్కడికి వస్తే వాళ్లకు మిమ్మల్ని పరిచయం చేస్తానని సురేష్ అంటాడు.

కావ్యని ఎక్స్‌పోకి రమ్మన్న సురేష్..

సురేష్ ఆ విషయం చెప్పగానే కావ్య ఆలోచనలో పడి.. పది సంవత్సరాలుగా ఆ ఎక్స్ పోలో మన కంపెనీకే అవార్డ్ వస్తుందని.. ఆయన కూడా అక్కడికి వస్తారు. కాబట్టి నేను వెళ్లక పోవడమే మంచిదని అనుకుని.. రేపు నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను రాలేనని అంటుంది. లేదండి మీరు రేపు అక్కడికి రావాలి అంతే.. ఇంకేం చెప్పొద్దని సురేష్ ఫోన్ పెట్టేస్తాడు. అదంతా విన్న కనకం.. వసేయ్ ఆయన అంతలా చెబుతుంటే ఎందుకు ఆలోచిస్తున్నావ్? అయినా రేపు నీకు అంత ముఖ్యమైన పని ఏముందని..కనకం అడుగుతుంది. అది కాదమ్మా.. రేపు ఆ ఎక్స్‌పోకి ఆయన కూడా వస్తారు. అందుకే అని అంటుంది కావ్య. ఓహో ఎక్కడ మీ ఆయన ఎదురు పడితే.. నువ్వు కరిగిపోయి.. ఎక్కడ మాట్లాడతావేమోనని భయ పడుతున్నావ్ కదా అని కనకం అంటే.. గాడిద గుడ్డేం కాదు.. ఆయన చేసిన పనికి వచ్చి నాతో మాట్లాడినా నేను మాట్లాడనని కావ్య అంటుంది. నువ్వు ఇలా అన్నందుకైనా నేను ఎక్స్ పోకి వెళ్తానని అంటుంది.

సీరియస్‌గా డిజైన్స్ వేసిన రాజ్..

మరోవైపు.. రాజ్ డిజైన్స్ వేసి శ్రుతికి ఇచ్చి.. ఎక్స్ పోకి పంపించాలని చెప్పేసి వెళ్తాడు. ఇక అనామిక ఫోన్ చేసి.. రుద్రాణికి అంత విషయం చెప్తుంది. రేపు జరగబోయే ఎక్స్ పోలో ఆ కావ్య వేసి డిజైన్స్ వాడుకుని అవార్డ్ రాజ్‌కి రానివ్వకుండా ఆపుతానని అనామిక అంటే.. సూపర్.. అని రుద్రాణి తెగ సంతోష పడుతుంది. ఏదైతేనే సొంత భార్య చేతిలో ఓటమి రాజ్ అస్సలు ఒప్పుకోలేడు. దీంతో వాళ్లిద్దరూ శాశ్వతంగా విడిపోతారు. ఆ కావ్య ఈ దుగ్గిరాల ఇంటికి పర్మినెంట్‌గా శత్రువుగా మారిపోతుందని అంటుంది. ఆ రాజ్‌కే కాదు నన్ను అవమానించిన కళ్యాణ్‌కి కూడా బుద్ధి వచ్చేలా చేస్తానని అనామిక అంటుంది. నువ్వు ముందు ఆ రాజ్, కావ్యల గురించి ఆలోచించమని రుద్రాణి అనగా.. వెనుక నుంచి వచ్చిన స్పప్న అంతా వినేస్తుంది. ఎలాగైనా మా అత్త కుట్రను ఆపాలని అనుకుంటుంది.

ఇవి కూడా చదవండి

కావ్యకి.. కనకం సలహా..

కట్ చేస్తే.. అప్పూ ఇంట్లో బాధ పడుతూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. నేను చెప్పేది ఒకసారి వినమని కళ్యాణ్ అంటాడు. నాకు వచ్చిన కోపానికి నేను ఏం చేస్తానో నాకే తెలీదు.. నువ్వు ముందు పక్కకు వెళ్లమని అప్పూ అంటుంది. నేను చెప్పేది ఒకసారి వినమని కళ్యాణ్ చెబుతున్నా.. అప్పూ వినిపించుకోదు. జాబిలమ్మా నీకు అంత కోపమా.. అంటూ పాట అందుకుంటాడు కళ్యాణ్. కవి పాటకు కరిగిపోతుంది అప్పూ. నా కోసం ఆటో నడపడటం నాకు నచ్చలేదని అంటుంది. నీ భవిష్యత్తును పక్కన పెట్టి నా కోసం వద్దు అని అంటుంది. నా భవిష్యత్తు నాకు ఎంత ముఖ్యమో.. నీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యమని కళ్యాణ్ చెప్తాడు.

ఎక్స్‌పోకి రుద్రాణి, స్వప్నలు..టెన్షన్‌లో సామంత్..

ఇక తెల్లవారుతుంది. కావ్య దణ్ణం పెట్టుకుని బయలుదేరుతుంది. కావ్య వెళ్లేటప్పుడు ఆపి.. అల్లుడు గారు నీతో మాట్లాడితే నువ్వు కూడా మంచిగా మాట్లాడు.. పొగరుగా సమాధానం చెప్పొద్దని కనకం అంటుంది. ఆయన నాతో మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగానే మాట్లాడతానని అంటూ నాకు టైమ్ అవుతుంది నేను వెళ్తున్నా అని వెళ్తుంది కావ్య. రాజ్ కూడా ఎక్స్‌పోకి బయలు దేరతాడు. అవార్డు నీకే రావాలని అపర్ణ హారతి ఇచ్చి వెళ్తుంది. అప్పుడే రుద్రాణి వచ్చి.. నేను కూడా వస్తానని అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మా అత్త వెళ్తుంది అంటే ఏదో చేస్తాదని స్వప్న అంటుంది. సరే నేను కూడా వస్తానని స్వప్న అంటుంది. ఇక అందరూ ఎక్స్ పోకి బయలు దేరుతారు. అలాగే అక్కడికి ముందుగా సామంత్, అనామికలు కూడా వస్తారు. రాజ్‌ని అస్సలు తక్కువ అంచనా వేయకూడదని సామంత్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..