Bigg Boss 8 Telugu: అఫీషియల్.. బిగ్ బాస్‌లోకి తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తు పట్టారా?

బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీనికి తోడు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున బాంబు పేల్చారు. అంటే ఈ వారంలోనే మరో ఇద్దరు బయటకు వెళ్లిపోవచ్చు.

Bigg Boss 8 Telugu: అఫీషియల్.. బిగ్ బాస్‌లోకి తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తు పట్టారా?
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2024 | 10:43 AM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ అప్పుడే ఐదో వారంలోకి ప్రవేశించింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగు పెడితే నలుగురు బయటకు వెళ్లిపోయారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీనికి తోడు ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున బాంబు పేల్చారు. అంటే ఈ వారంలోనే మరో ఇద్దరు బయటకు వెళ్లిపోవచ్చు. అందుకు తగ్గట్లే ఈసారి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్నది సస్పెన్స్‌గా మారింది. విష్ణుప్రియ, నబీల్ అఫ్రిదీ, నైనిక, ఆదిత్య ఓమ్, నిఖిల్, నాగ మణికంఠ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. మరోవైపు గత కొన్నిరోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి సోషల్ మీడియాలో తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. టేస్టీ తేజ, ముక్కు అవినాష్, హరితేజ, రోహిణి, యాంకర్ రవి, నయని పావని.. ఇలా పలువురి ప్రముఖులు వైల్డ్ కార్డ్ తో మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు దీనిపై కీ అప్డేట్ ఇచ్చారు. ‘తొలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరో చెప్పుకోండి చూద్దాం’ అంటూ నీడతో ఉన్న ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా రిలీజ్ చేశారు.

దీనిని చూసిన బిగ్ బాస్ అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన పేర్లు చెబుతున్నారు. ఫొటోను చూస్తుంటే గత బిగ్ బాస్ సీజన్ లో సందడి చేసిన టేస్టీ తేజనే అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. గత సీజన్‌లో కమెడియన్ కోటాలో హౌస్‌లోకి వెళ్లిన టేస్టీ తేజాకి 9 వారాల పాటు హౌస్‌లో ఉన్నాడు. మరి ఈసారి ఎన్ని వారాల పాటు బిగ్ బాస్ లో ఉంటాడో తెలియాల్సి ఉంది. కాగా శనివారం (అక్టోబర్ 01) నాటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి రానున్నారని తెలుస్తోంది. అయితే కొత్త వాళ్లను కాకుండా పాత కంటెస్టెంట్స్‌నే వైల్డ్ కార్డ్‌ల ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శనివారం నాటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ..

 బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.