AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indraja: నటి ఇంద్రజ ఫ్యామిలీని చూశారా? హీరోయిన్ లాంటి కూతురు.. త్వరలోనే సినిమాల్లోకి కూడా !

సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇంద్రజ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలోనూ ఈ నటి ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా కనిపించరు. కాగా సాంప్రదాయ తుళు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇంద్రజ తమిళ టీవీ నటుడు అబ్సర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

Indraja: నటి ఇంద్రజ ఫ్యామిలీని చూశారా? హీరోయిన్ లాంటి కూతురు.. త్వరలోనే సినిమాల్లోకి కూడా !
Indraja
Basha Shek
|

Updated on: Sep 29, 2024 | 10:35 PM

Share

సీనియర్ నటి ఇంద్రజ గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 90లలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందామె. స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది. అయితే చాలా మంది హీరోయిన్ల లాగానే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తోంది. అలాగే టీవీ షోలకు జడ్జిగా వ్యవహారిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. ఇటీవల ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే టీవీ షోలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇంద్రజ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలోనూ ఈ నటి ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా కనిపించరు. కాగా సాంప్రదాయ తుళు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇంద్రజ తమిళ టీవీ నటుడు అబ్సర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరివి వేర్వేరు మతాలు కావడంతో తల్లిదండ్రులు ఇంద్రజ పెళ్లికి అంగీకరించలేదట. దీంతో ఇంద్రజ, అబ్సర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంద్రజనే ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు.

ఇంద్రజ- అబ్బర్ దంపతులకు సారా అనే ముద్దుల కూతురు ఉంది. త్వరలోనే ఆమె కూడా సినిమ ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం సారా సంగీతం నేర్చుకుంటోందట. కొన్ని రోజుల క్రితం తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నా కూతురుకు నటన కన్నా మ్యూజిక్ మీద ఎక్కువ ఆసక్తి ఉంది. భవిష్యత్ లో తను మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా సారా కూడా తల్లి ఇంద్రజ లాగే ఎంతో అందంగా ఉంది. దీంతో అభిమానులు, నెటిజన్లు సారాను హీరోయిన్ గా ట్రై చేయమంటున్నారు. మరి ఫ్యూచర్ లో సారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కూతురితో ఇంద్రజ…

ఏటీఎం సెంటర్ లో వింత శబ్ధాలు.. గుండె గుభేల్ .. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్