Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIFA: ఐశ్వర్యరాయ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్.. ఐష్ చేసిన పనికి అందరూ ఫిదా

వయసు పెరిగిన వన్నె తగ్గని అందంతో కట్టిపడేసింది ఈ మాజీ విశ్వసుందరి. ఇక ఇప్పుడు అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) ఉత్సవం 2024లో ఐష్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కనిపించింది. అయితే, అవార్డుల ఫంక్షన్‌లో ఐశ్వర్యరాయ్ చేసిన పని ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

IIFA: ఐశ్వర్యరాయ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్.. ఐష్ చేసిన పనికి అందరూ ఫిదా
Actress Aishwarya Rai Iifa
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2024 | 11:23 AM

అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్యారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐష్ తన అందచందాలతో చూపరుల మతి చెడగొట్టింది. వయసు పెరిగిన వన్నె తగ్గని అందంతో కట్టిపడేసింది ఈ మాజీ విశ్వసుందరి. ఇక ఇప్పుడు అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) ఉత్సవం 2024లో ఐష్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కనిపించింది. అయితే, అవార్డుల ఫంక్షన్‌లో ఐశ్వర్యరాయ్ చేసిన పని ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ఆమె ఒదిగి ఉన్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఐష్ ఓ యాంకర్ ను ఓదార్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

ఐఫా వేడుకల్లో ఐశ్వర్య.. నటసింహం నందమూరి బాలకృష్ణ కళ్ళకు నమస్కరించిన విషయం తెలిసిందే. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా పెద్దలను గౌరవించింది. బాలయ్యతో పాటు స్టార్ డైరెక్టర్ మణిరత్నం కళ్ళకు నమస్కరించింది ఐష్. ఇక ఇదే అవార్డ్స్ వేడుకలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. అక్కడ ఉన్న ఒక యాంకర్ ఐష్ ను చూడగానే వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

వైరల్ అవుతున్న వీడియోలో, ఐశ్వర్య  కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్‌ను ఓదార్చడం చూడొచ్చు. వీడియోలో, యాంకర్ ఏడుస్తూ, మాజీ విశ్వ సుందరిని కలవడం తన కల అని చెప్పింది. మిమ్మల్ని కలవడం నాకు ఒక కల అది ఇప్పుడు నిజమైంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అది విన్న ఐశ్వర్య, ఓహ్ గాడ్ అంటూ ఆమెను కౌగిలించుకుంది. దాంతో ఆ యాంకర్ ఇంకా ఏడ్చేసింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కాగా ఈ ఈవెంట్‌లో ఐశ్వర్యరాయ్ తాను నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రానికి గానూ ఉత్తమ నటి (తమిళం) అవార్డును అందుకుంది. ఈ కార్యక్రమంలో, డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ డ్రస్ లో మెరిసింది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.