AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది హీరోయిన్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. మరికొంతమంది సైడ్ డాన్సర్లుగా కూడా చేశారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.?

ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 27, 2024 | 11:59 AM

Share

చాలా మంది సినిమాల్లో కష్టపడి వచ్చిన వారే.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఏళ్లు ఎదురుచూసి ఎట్టకేలకు సక్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది హీరోయిన్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. మరికొంతమంది సైడ్ డాన్సర్లుగా కూడా చేశారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిది ఆ ముద్దుగుమ్మ. అంతే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ తోనూ నటించి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి :Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని ఇప్పుడు చూస్తే అవాక్ అవుతారు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూసే ఇదెక్కడి మేకోవర్ రా మావ అని అంటారు. అంతలా మారిపోయింది ఆ అందాల భామ. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఇది కూడా చదవండి :Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా క్రేజ్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. నెటిజన్స్ ను తన అందంతో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. కాగా పైన కనిపిస్తున్న ఫొటోకు సంబందించిన వీడియో వైరల్ గా మారడంతో అందరు షాక్ అవుతున్నారు. మరికొంతమంది అది సాయి ధన్సిక అనే నమ్మలేకపోతున్నాం.. అది నిజం కాకపోవొచ్చు అని అంటున్నారు.

సాయి ధన్సిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us