Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్,లైగ‌ర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాల్లో డియర్ కామ్రేడ్ సినిమా ఒక్కటే కాస్త పర్లేదు అనిపించుకుంది. మిగిలినవన్నీ నిరాశపరిచాయి. ఇక విజయ్ సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా గీతగోవిందం.

Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది
Geetha Govindam
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 26, 2024 | 8:31 PM

విజయ్ దేవర కొండ హీరోగా నటించిన సినిమాలు ఈ మధ్య పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలాలాంటి వరుస హిట్స్ అందుకున్న విజయ్ ఆతర్వాత ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్,లైగ‌ర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాల్లో డియర్ కామ్రేడ్ సినిమా ఒక్కటే కాస్త పర్లేదు అనిపించుకుంది. మిగిలినవన్నీ నిరాశపరిచాయి. ఇక విజయ్ సినిమాల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా గీతగోవిందం. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించారు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన వారికి మంచి క్రేజ్ వచ్చింది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!

2018లో వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. గీతగోవిందం సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చాడు .. ఈ సినిమా సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికి ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో విజయ్‌ను ప్రేమించిన స్టూడెంట్‌గా నటించిన అమ్మాయి గుర్తుందా.? గీతగోవిందం సినిమాలో విజయ్ లెచ్చరర్ గా నటించాడు. అతన్ని ఇష్టపడే అమ్మాయిగా నటించిన ఆ బ్యూటీ పేరు అనీషా దామా.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

ఈ సినిమాలో ఆమె కనిపించింది కొంత సేపే అయినా.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత పలు సినిమామల్లో నటించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మారే ప్రయత్నాలు చేస్తోంది. సత్తిగాని రెండెకరాలు అనే సినిమాలో నటించింది . ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో ఈ వయ్యారి తన క్రేజీ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: వైల్డ్ కార్డు ఎంట్రీ ప్లాన్ అదిరిందిగా..! హౌస్‌లోకి ముగ్గురు హాట్ బ్యూటీలు..

View this post on Instagram

A post shared by Aneesha Dama (@aneeshadama)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.