AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి,  బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజలీ. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా.. దేవి పుత్రుడు,  నాగార్జునతో..

ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!
Anjala Zaveri
Rajeev Rayala
|

Updated on: Sep 24, 2024 | 6:17 PM

Share

తెలుగు ఇండస్ట్రీలోకి చాలా మంది ముద్దుగుమ్మలు పరిచయం అయ్యారు. ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ టాలీవుడ్ ను ఏలారు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేసి మాయం అవుతున్నారు. కొంతమంది ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక ఒకప్పుడు తన అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అంజలా జవేరి. ఈ ముద్దుగుమ్మ తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. కాగా అంజలిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది విక్టరీ వెంకటేష్. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా..  సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అంజలా. అప్పటిలో ఈ అమ్మడు యూత్ ఆరాధ్య దేవత.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

తెలుగులో ఈ అమ్మడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి,  బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది అంజలా. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా.. దేవి పుత్రుడు,  నాగార్జునతో చందమామ రావే, చిరంజీవితో చూడాలని ఉంది, బాలకృష్ణతో నరసింహనాయుడు.. భలేవాడివి బాసులాంటి సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇక అంజలా జవేరి తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. ఆ తర్వాత తిరిగి తెలుగులో ప్రేమ సందడి, ఆప్తుడు సినిమాలు చేసింది. ఆలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. వీటితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలోను మెరిసింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది అంజలా జవేరి. అయితే ఈ అమ్మడు ఇప్పటికి కూడా అదే అందంతో కళ్లు చెదిరేలా ఉంది. అయితే ఆమె భర్త గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.

ఇది కూడా చదవండి : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ క్రేజ్ మాత్రం పీక్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

అంజలా జవేరి భర్త టాలీవుడ్ నటుడే..అతని పేరు తరుణ్ అరోరా..అంజలా, తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో విలన్ గా చేశాడు. జయ జానకీ నాయకా, కాటమ రాయుడు, అమర్ అక్బర్ ఆంటోనీ, అర్జున్ సురవరం వంటి సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు తరుణ్ అరోరా. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ స్టైలిష్ విలన్. అంజలా జవేరి, తరుణ్ అరోరాకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి భర్తను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఈ ఇద్దరి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us