AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

నాగ చైతన్య ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోసారి చైతు ఆసక్తికర కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. తండేల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమమ్, సవ్యసాచి సినిమాలకు దర్శకత్వం వహించాడు.

Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Nagachaitanya
Rajeev Rayala
|

Updated on: Sep 23, 2024 | 8:21 PM

Share

అక్కినేని అందగాడు నాగ చైతన్య విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. త్వరలోనే నాగ చైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య వివాహం జరగబోతుంది. ఇక నాగ చైతన్య ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోసారి చైతు ఆసక్తికర కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. తండేల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమమ్, సవ్యసాచి సినిమాలకు దర్శకత్వం వహించాడు. హిట్స్ , ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నాగ చైతన్య. చైతు చాలా మంది హీరోయిన్స్‌తో కలిసి నటించాడు.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇదిలా ఉంటే నాగ చైతన్యతో ఓ క్రేజీ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్ గా, అలాగే లవర్ గా నటించింది. ఆ అమ్మడు ఎవరో తెలుసా.? సినిమాల్లో ఒక హీరో సేమ్ హీరోకు ప్రియురాలిగా, అమ్మగా, అక్కగా , వదిన గా నటించడం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే ఇప్పుడు నాగ చైతన్య తో కూడా ఓ హీరోయిన్ తల్లిగా, ఫ్రెండ్‌గా, లవర్‌గా చేసి ప్రేక్షకులను మెప్పించింది.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఆమె మరెవరో కాదు అందాల భామ లావణ్య త్రిపాఠి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మెగా ఇంటి కోడలు అయ్యింది. మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ అమ్మడు. కాగా ఈ బ్యూటీ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఆయనకు భార్యగా నటించింది. అయితే ఆ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగ్ కొడుకుగా నాగ చైత్యన నటించాడు. అలాగే మనం సినిమాలో వీరిద్దరూ స్నేహితులుగా కనిపించారు. మనం సినిమాలో ఆమె చిన్న పాత్రలోనే నటించింది. అలాగే ఈ ఇద్దరూ హీరో హీరోయిన్స్ గా యుద్ధం శరణం అనే సినిమాలో చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇలా నాగ చైతన్యతో లావణ్య త్రిపాఠీ అమ్మగా, ఫ్రెండ్ గా, లవర్ గా నటించి మెప్పించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి ఆ ముద్దుగుమ్మ.. ఈసారి రచ్చ రచ్చ ఖాయం అంటున్నారే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..