Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి ఆ ముద్దుగుమ్మ.. ఈసారి రచ్చ రచ్చ ఖాయం అంటున్నారే

గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో అంతగా కంటెస్టెంట్స్ ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ఓ సరికొత్త ప్లాన్ అమలు చేయనున్నారని తెలుస్తోంది. గత సీజన్ లోని కంటెస్టెంట్స్ మరోసారి హౌస్ లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొంత మందిని ఫైనల్ కూడా చేశారని టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్‌లో మరోసారి ఆ ముద్దుగుమ్మ.. ఈసారి రచ్చ రచ్చ ఖాయం అంటున్నారే
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 21, 2024 | 4:19 PM

బిగ్ బాస్ సీజన్ 8 ఆశించిన స్థాయిలో రసవత్తరంగా సాగడం లేదు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవడం. గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్‌లో అంతగా కంటెస్టెంట్స్ ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ఓ సరికొత్త ప్లాన్ అమలు చేయనున్నారని తెలుస్తోంది. గత సీజన్ లోని కంటెస్టెంట్స్ మరోసారి హౌస్ లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొంత మందిని ఫైనల్ కూడా చేశారని టాక్ వినిపిస్తుంది. గత సీజన్స్ లో తమ గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కొందరు మరోసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారు.

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇప్పటికే కొంతమంది పేర్లు వైరల్ అవ్వగా ఇప్పుడు మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో నలుగురు కంటెస్టెంట్లను తీసుకువస్తున్నారట. రోహిణి, అవినాష్, నయని పావని, శోభా శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కంటెస్టెంట్ పేరు కూడా వినిపిస్తుంది. గత సీజన్‌లో హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన బ్యూటీ రతికా రోజ్ కూడా సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి :ఒకరితో నిశ్చితార్థం.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ, పెళ్లి.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

సీజన్ 7లో రతికా రోజ్ తన అతనితో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. అలాగే పల్లవి ప్రశాంత్ తో ముందుగా పులిహోర కలిపింది. ఆ తర్వాత అతనితోనే గొడవపెట్టుకుంది. అలాగే హౌస్ లో ఉన్న అందరితో గొడవలు పెట్టుకుంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. ఆతర్వాత తిరిగి రతికాను హౌస్ లోకి పంపించారు. కానీ ఫైనల్ వరకు వెళ్లకపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో బిజీగా అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడిని మరోసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. మా ; రి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. రతికా వస్తే మాత్రం హౌస్ లో రచ్చ రచ్చ జరుగుతుందని నెటిజన్స్ అంటున్నారు. మరి నిజంగా రతికా రోజ్ బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్.. అరుంధతి చిన్నారి అదరగొట్టిందిగా..!! ఇలా అస్సలు ఊహించలేదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.