అమ్మబాబోయ్.. అరుంధతి చిన్నారి అదరగొట్టిందిగా..!! ఇలా అస్సలు ఊహించలేదు గురూ..!

2009 లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు అనేక అవార్డులను కూడా అందుకుంది. ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని అందుకుంది అరుంధతి సినిమా. ఈ సినిమా తర్వాత అనుష్క పేరు మారుమ్రోగిపోయింది. అరుంధతి సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించింది.

అమ్మబాబోయ్.. అరుంధతి చిన్నారి అదరగొట్టిందిగా..!! ఇలా అస్సలు ఊహించలేదు గురూ..!
Arundhati
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2024 | 5:57 PM

దిగజా దర్శకుడు కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో అద్భుతమైన సినిమా అరుంధతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2009 లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు అనేక అవార్డులను కూడా అందుకుంది. ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని అందుకుంది అరుంధతి సినిమా. ఈ సినిమా తర్వాత అనుష్క పేరు మారుమ్రోగిపోయింది. అరుంధతి సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో చిన్ననాటి అరుంధతిగా నటించిన చిన్నారి గుర్తుందా.? గద్వాల సంస్థానం యువరాణిగా నటించింది ఆ చిన్నారి. ఆమె ఇప్పుడు ఎలా ఉంది.? ఎక్కడ ఉంది.?

ఇది కూడా చదవండి : మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇప్పటికి కూడా అరుంధతి సినిమాను టీవిలో ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు . అరుంధతి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నారి పేరు దివ్య నగేష్. అరుంధతి సినిమాతో ఈ చిన్నారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మ్లరిపోయింది. దివ్య నగేష్ హీరోయిన్ గా పలు మలయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో నేను నాన్న అబద్దం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : ఏంటీ..! శ్రీదివ్యకు ఇంత అందమైన అక్క ఉందా.! పైగా ఆమె టాలీవుడ్ హీరోయిన్ కూడా..!!

ప్రస్తుతం దివ్య నగేష్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలోచక్కర్లు కొడుతున్నాయి. నెట్టింట ఈ అమ్మడి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ చిన్నారి ఈ అమ్మడేనా అని ఆశ్చర్యపోతున్నారు. దివ్య నగేష్ లేటెస్ట్ ఫోటోలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈ క్యూటీస్‌లో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది..కనిపెట్టండి చూద్దాం.!

అరుంధతి చిన్నారి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.