మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?

చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి . ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

మహానటి సావిత్రితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. ఎవరో గుర్తుపట్టారా.?
Savitri
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2024 | 8:30 AM

చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా పేరు తెచ్చుకున్నారు మహానటి సావిత్రి . ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాత్రకు ప్రాణం పోయడం ఆమెకే సాధ్యం అన్నంతగా జీవిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సావిత్రి. ఇక పై ఫొటోలో సావిత్రితో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా.? అతను కూడా తిరుగులేని నటుడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన ఓ పాన్ ఇండియా స్టార్.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

ఇంతకూ ఆయన ఎవరంటే.. పై ఫొటోలో మహానటి తో ఉన్నది ఎవరో కాదు లోకనాయడు కమల్ హాసన్. కమల్ హాసన్ బాలనటుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆతర్వాత 20ఏళ్ళ వయస్సులో హీరోగా మారి తెలుగు,  తమిళ, హిందీ భాషల్లో నటించి ఆకట్టుకున్నారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కమల్. స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కమల్ హాసన్ ద్వి పాత్రయంలోనే కాదు.. మరగుజ్జు గా కూడా నటించి అలరించాడు. ఇక దశావతారం మూవీలో ఏకంగా 10విభిన్న పాత్రల్లో నటించింది అబ్బురపరిచారు.

ఇది కూడా చదవండి :డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె..

నాలుగేళ్ల వయస్సులో కళధూర్ కణ్ణమ్మ మూవీలో నటించిన కమల్ హాసన్ మహానటి సావిత్రితో కలిసి నటించారు. ఈ సినిమాలో సావిత్రి, జెమిని గణేశన్ జంటగా నటించారు. ఇదే సినిమా తెలుగులో మావూరి అమ్మాయి అనే పేరుతో విడుదలైంది. ఆతర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించారు. కమల్ హాసన్ అసలు పేరు పార్ధసారధి. కమల్ హాసన్ ఓల్డ్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. 62ఏళ్ళ వయస్సులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ అలరిస్తున్న కమల్. మొన్నామధ్య విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్ రీసెంట్ గా కల్కి సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కల్కి 2లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనుంది.

ఇది కూడా చదవండి : Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే

Kamal Haasan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.