AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే

తాజాగా ఓ హీరోయిన్ డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ.. రోడ్డు పైకి వచ్చి ఇలా డాన్స్ చేసింది. మాములుగా హీరోయిన్స్ అంటే సినిమా ఫంక్షన్స్, లేదా సినిమా ప్రమోషన్స్, ఏదైనా షాపింగ్ మాల్ ఓపినింగ్స్ సమయంలోనే బయటకు వస్తుంటారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసి సరిపెట్టుకుంటారు.

Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 17, 2024 | 6:04 PM

Share

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశాన్నే కుదిపేసింది. ఈ ఘటన పై దేశ నలుమూలల నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే చాలా మంది ఈ ఘటనను ఖండిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ.. రోడ్డు పైకి వచ్చి ఇలా డాన్స్ చేసింది. మాములుగా హీరోయిన్స్ అంటే సినిమా ఫంక్షన్స్, లేదా సినిమా ప్రమోషన్స్, ఏదైనా షాపింగ్ మాల్ ఓపినింగ్స్ సమయంలోనే బయటకు వస్తుంటారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసి సరిపెట్టుకుంటారు. కానీ ఈ హీరోయిన్ అలా కాదు. ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనను నిరసిస్తూ ప్రజలతో కలిసి ఇలా రోడ్డు పైకి వచ్చి నిరసన తెలిపింది. నిరసన తెలుపుతూ డాన్స్ కూడా చేసింది. దాంతో ఆమె పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

సినీ సెలబ్రెటీలు కూడా ఇలా బయటకు వచ్చి తమ నిరసన తెలిపితే ప్రభుత్వ లు త్వరగా స్పందిస్తాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు రోడ్డు పైకి వచ్చి డాన్స్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె పేరు మోక్షా సేన్‌గుప్తా.. బెంగాల్ కు చెందిన ఈ నటి తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. ఇప్పటికీ చేస్తోంది. ‘నీతోనే నేను’, ‘అలనాటి రామచంద్రుడు’, ‘ఐ హేట్‌ యూ’ సినిమాల్లో నటించింది.

ఇది కూడా చదవండి : Sunil Wife: సునీల్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

ఇక రీసెంట్ గా ధనరాజ్, సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న రామం రాఘవం సినిమాలోనూ మోక్షా సేన్‌గుప్తా నటించింది. తెలుగులో మరిన్ని ఆఫర్స్ కోసం ఆమె ప్రయత్నిస్తుంది. కాగా ఇప్పుడు ఇలా ఆమె బెంగాల్‌ రోడ్లపై నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె లానే సినీ సెలబ్రెటీలు బయటకు వచ్చి నిరసన తెలుపని అని నెటిజన్స్ కోరుతున్నారు. ఇక ఈ వీడియో పై మోక్షా సేన్‌గుప్తా ను పొగుడుతూ కామెంట్స్ కురిపిస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.