ఒకరితో నిశ్చితార్థం.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ, పెళ్లి.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

ఇక సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ షిప్స్, ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడిపోవడాలు మనం తరచు చూస్తే ఉన్నాం. చాలా మంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే కొంతమంది మాత్రం బ్రేకప్ లు, విడాకులతో వార్తల్లో నిలుస్తున్నారు.

ఒకరితో నిశ్చితార్థం.. కట్ చేస్తే మరొకరితో ప్రేమ, పెళ్లి.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 19, 2024 | 8:53 PM

సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలోకి చాలా మంది ఎన్నో కలలతో అడుగుపెడతారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. ఇక కొంతమంది సక్సెస్ కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవకాశాలు తగ్గుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఇక సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ షిప్స్, ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడిపోవడాలు మనం తరచు చూస్తే ఉన్నాం. చాలా మంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే కొంతమంది మాత్రం బ్రేకప్ లు, విడాకులతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న చిన్నది కూడా అంతే.. నేచురల్ స్టార్ నాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. వరుసగా హిట్స్ అందుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే నిశ్చితార్థం చేసుకుంది.. కట్ చేస్తే పెళ్లి క్యాన్సిల్..

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

ఆ తర్వాత మరొకరితో ప్రేమ , నిశ్చితార్థం.. సీక్రెట్ గా పెళ్లి కూడా అయిపొయింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఆ బ్యూటీ. ఆమె మరెవరో కాదు.. క్యూట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా. నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్స్ అందుకుంది. జవాన్, పంతం, కవచం సినిమాలతో ఫ్లాప్స్ అందుకుంది.

ఇది కూడా చదవండి :డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె..

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2, F3 సినిమాలతో హిట్స్ అందుకుంది. ఇదిలా ఉంటే కెరీర్ పీక్ లో ఉండగానే.. 2021లో అడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో మెహ్రీన్ నిశ్చితార్థం జరిగింది. ఇది జరిగిన కొన్ని నెలలకే ఈ ఇద్దరూ పెల్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆతర్వాత సోషల్ మీడియాతో బిజీగా గడిపిన మెహరీన్. 2023లో చిరంజీవ్ మక్వానాతో నిశ్చితార్థం చేసుకుంది. ఇటీవలే ఈ ఇద్దరూ హైదరాబాద్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మెహ్రీన్ సినిమాల కోసం ఎదురుచూస్తుంది.

ఇది కూడా చదవండి : Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.