AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8: వైల్డ్ కార్డు ఎంట్రీ ప్లాన్ అదిరిందిగా..! హౌస్‌లోకి ముగ్గురు హాట్ బ్యూటీలు..

తాజాగా విడుదల చేసిన ప్రమోలో బిగ్ బాస్ సీజన్స్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 12,మందిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపిస్తున్నట్టు తెలిపాడు బిగ్ బాస్. అలాగే హౌస్ లో ఉన్న వారికి టాస్క్ లు ఉంటాయని ఆ టాస్క్ ల్లో విన్ అయితే ఆ 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపొచ్చు అని తెలిపాడు బిగ్ బాస్. 

Bigg Boss 8: వైల్డ్ కార్డు ఎంట్రీ ప్లాన్ అదిరిందిగా..! హౌస్‌లోకి ముగ్గురు హాట్ బ్యూటీలు..
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2024 | 5:32 PM

Share

బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంత రసవత్తరంగా సాగడం లేదు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతగా కంటెంట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్స్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి పంపనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రమోలో బిగ్ బాస్ సీజన్స్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 12 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపిస్తున్నట్టు తెలిపాడు బిగ్ బాస్. అలాగే హౌస్ లో ఉన్న వారికి టాస్క్ లు ఉంటాయని ఆ టాస్క్ ల్లో విన్ అయితే ఆ 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపొచ్చు అని తెలిపాడు బిగ్ బాస్.

దాంతో ఎన్ని టాస్క్ లు విన్ అయితే అంతమంది హౌస్ లోకి రాకుండా ఆపొచ్చు. అయితే ఈసారి హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే వారిలో గత సీజన్స్ కు సంబందించిన వారే ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ముగ్గురు ముద్దుగుమ్మల పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. గత సీజన్స్ లో ఈ భామలు తమ ఆటతో పాటు అందంతోనూ ఆకట్టుకున్నారు. ఇంతకూ ఆ ముగ్గురూ ఎవరంటే.

బిగ్ బాస్ సీజన్ 1కు తారక్ హోస్ట్ గా వ్యవహరించారు. సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకుంది హరితేజ. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన హరితేజ బిగ్ బాస్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత సినిమాల్లో అంతగా రాణించలేకపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది. అలాగే సీజన్ 2లో పాల్గొన్న దీప్తి సునైనా కూడా సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో అందాలతో ఆకట్టుకుంటుంది. వీరితో పాటు మరో హాట్ బ్యూటీ ఇనయా సుల్తానా కూడా సీజన్ 8లోకి అడుగు పెడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొంది ఈ అమ్మడు.

హరితేజ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

దీప్తి సునైనా ఇన్ స్టా గ్రామ్

ఇనయా సుల్తానా ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..