AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవర మూవీలో ఎన్టీఆర్ భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. అస్సలు ఊహించి ఉండరు

'దేవర' మూవీలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రికొడుకుల పాత్రల్లో ఎన్టీఆర్ సందడి చేయనున్నాడు. దేవర, వర అనే రెండు పాత్రల్లో యంగ్ టైగర్ కనిపించనున్నాడు. వర పాత్రకు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుండగా..

దేవర మూవీలో ఎన్టీఆర్ భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. అస్సలు ఊహించి ఉండరు
Sruthi Marathe
Ravi Kiran
|

Updated on: Sep 25, 2024 | 6:00 PM

Share

‘దేవర’ మూవీలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రికొడుకుల పాత్రల్లో ఎన్టీఆర్ సందడి చేయనున్నాడు. దేవర, వర అనే రెండు పాత్రల్లో యంగ్ టైగర్ కనిపించనున్నాడు. వర పాత్రకు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. తండ్రి క్యారెక్టర్‌ దేవరకు జోడిగా శృతి మరాఠీ నటిస్తోంది. అసలీ శృతి మరాఠీ ఎవరు.? ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా..

గుజరాత్‌కు చెందిన ఈ బ్యూటీ.. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత మరాఠీ, హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసింది. అంతేకాదు హిందీ సీరియల్స్‌లోనూ, వెబ్‌సిరీస్‌లలోనూ ఛాన్స్‌లు దక్కించుకుంది ఈ అందాల భామ. ‘సనై చౌఘడే’ అనే మరాఠీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. ‘ఆస మి తాసా మి’, ‘లగాలి పైజ్’, ‘తుజ్హి మజ్హి లవ్ స్టొరీ’, ‘ప్రేమసూత్ర’, ‘రామ మాధవ్’ లాంటి చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది శృతి. ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్ ఘటనేకర్‌ను 2016లో ప్రేమించి పెళ్లి చేసుకుంది శృతి మరాఠీ. తెలుగులో ఆమెకు దేవర మొదటి సినిమా కాగా.. తొలి చిత్రంతోనే ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అందాల ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ మూవీలో శృతి మరాఠీ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, ఈమె మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం శృతి మరాఠీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, దేవర మూవీకి కొరటాల శివ దర్శకుడు కాగా.. సుమారు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరో‌గా చేస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్లు, పాటలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని.. సినిమాపై అంచనాలు పెంచేశాయ్. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న ఈ మూవీ విడుదల కానున్న విషయం విదితమే.

ఇది చదవండి: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..