AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే

ప్రతీ ఒక్క మనిషికి ఏదొక బలహీనత ఉండటం సర్వసాధారణం. ఇక కొందరిలో ప్రేమ.. మరికొందరిలో కోపం.. ఇంకొందరిలో సహనం.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విభిన్న లక్షణాలు ఉంటాయి. కొందరైతే ఈ లక్షణాలను..

Personality Test: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే
Personality Test
Ravi Kiran
|

Updated on: Sep 24, 2024 | 12:51 PM

Share

ప్రతీ ఒక్క మనిషికి ఏదొక బలహీనత ఉండటం సర్వసాధారణం. ఇక కొందరిలో ప్రేమ.. మరికొందరిలో కోపం.. ఇంకొందరిలో సహనం.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విభిన్న లక్షణాలు ఉంటాయి. కొందరైతే ఈ లక్షణాలను నియంత్రించుకుంటూ ప్రశాంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఓ వ్యక్తి తన మాట్లాడే తీరు బట్టి.. అతడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చునని మీకు తెల్సా.! అదెలాగో ఇప్పుడు చూద్దాం..

వేగంగా మాట్లాడేవారు:

వేగంగా మాట్లాడే వ్యక్తులు శారీరకంగా దృఢంగా ఉంటారు. ఎలప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఈ వ్యక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండటమే కాకుండా.. ఎలాంటి వివాదంలోనూ చిక్కుకోవడానికి ఇష్టపడరు.

బిగ్గరగా మాట్లాడేవారు:

కొందరు పెద్ద గొంతుతో మాట్లాడటం మీరు చూసి ఉండవచ్చు. ఈ వ్యక్తుల్లో నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులను ఓడించడం వీరికి ఇష్టం. అంతేకాకుండా వారు మాట్లాడుతున్నప్పుడు మరొకరు మాట్లాడితే ఇష్టపడరు. ఈ వ్యక్తుల ప్రభావం ఇతరులపై ఎక్కువ ఉంటుంది.

నత్తిగా మాట్లాడేవారు:

మీ చుట్టూ నత్తిగా మాట్లాడే వ్యక్తులు ఉంటే, అలాంటి వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం తక్కువ. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. నత్తిగా మాట్లాడే వ్యక్తులు వారిలో న్యూనతాభావం, భయం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి.

ఇతరులు మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడటం:

కొంతమందికి ఎవరైనా మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడే ధోరణిని కలిగి ఉంటుంది. వీరిలో మొండితనం ఎక్కువగా ఉంటుంది. అయితే మంచి ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. తన మాటలకు సమాధానం చెప్పకపోతే త్వరగా కోపగించుకునే స్వభావం వీరిది.

అస్పష్టంగా మాట్లాడేవారు:

కొందరు మాట్లాడేటప్పుడు.. వారి మాటలు అస్పష్టంగా ఉంటాయి. ఈ వ్యక్తులు తమ పని పట్ల అజాగ్రత్తగా ఉంటారు, కానీ వారు నిజాయితీపరులు. అలాగే వీరు మాట్లాడే కొన్ని మాటలు సరిగ్గా అర్ధకకపోవడం వల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది.

నిదానంగా మాట్లాడేవారు:

ఇలాంటి వ్యక్తులు అంతర్ముఖులు లేదా సందిగ్ధ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా వింటారు. ఎదుటి వారు మాట్లాడే విషయాలనూ స్పష్టంగా వింటారు. ఈ వ్యక్తులు తమ పనిలో చాలా శ్రద్ధ వహిస్తారు.

అరుస్తూ మాట్లాడే వ్యక్తులు:

ఈ వ్యక్తులు అరుస్తూ మాట్లాడతారు. ఈ వ్యక్తులు ఎలప్పుడూ ఎదుటివారిని మెప్పించడంలో ఫెయిల్ అవుతుంటారు. వీరు పిరికివారు, అలాగే ఆత్మవిశ్వాసం కూడా తక్కువే. అభద్రత, డిపెండెన్సీ, చంచలమైన స్వభావం కలిగి ఉంటారు.

మృదువుగా మాట్లాడేవారు:

వీరు బలంగా, నమ్మకంగా, దృఢంగా, బహిర్ముఖంగా ఉంటారు. మనోహరమైన, ఓపెన్ మైండెడ్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన ఈ వ్యక్తులు ఇతరులను తమవైపు ఆకర్షిస్తారు.

ఇది చదవండి: రాగల 24 గంటల్లో మరో అల్పపీడనం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నాతో సినిమా చేస్తావా.. 15 కోట్లు + కండీషన్స్ అప్లై
నాతో సినిమా చేస్తావా.. 15 కోట్లు + కండీషన్స్ అప్లై
డిజాస్టర్ మూవీ కోసం రూ.1000 కోట్ల ధురంధర్ మిస్ చేసుకున్న నాగ్
డిజాస్టర్ మూవీ కోసం రూ.1000 కోట్ల ధురంధర్ మిస్ చేసుకున్న నాగ్
రాజాసాబ్ రిజల్ట్‌పై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్
రాజాసాబ్ రిజల్ట్‌పై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్
నలుగురు భారతీయులను కాల్చి చంపిన వ్యక్తి..!
నలుగురు భారతీయులను కాల్చి చంపిన వ్యక్తి..!
అతడితో ప్రేమలో ఉన్నాను.. రిలేషన్‌ పై ఓపెన్ అయినా ఫరియా అబ్దుల్లా
అతడితో ప్రేమలో ఉన్నాను.. రిలేషన్‌ పై ఓపెన్ అయినా ఫరియా అబ్దుల్లా
స్టీల్ సింక్ పాతబడిపోయిందా? ఇలా చేస్తే కొత్తదానిలా మెరవాల్సిందే!
స్టీల్ సింక్ పాతబడిపోయిందా? ఇలా చేస్తే కొత్తదానిలా మెరవాల్సిందే!
సబ్జెక్టులో రాటు దేలితేనే ర్యాంకు.. విద్యార్ధులూ గమనిస్తున్నారా?
సబ్జెక్టులో రాటు దేలితేనే ర్యాంకు.. విద్యార్ధులూ గమనిస్తున్నారా?
కుజ గ్రహం ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి అనూహ్య నష్టాలు, సమస్యలు..!
కుజ గ్రహం ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి అనూహ్య నష్టాలు, సమస్యలు..!
కోపంతో ఈ 3 పనులు చేస్తే.. లక్ష్మీదేవి, విజయం దూరం!
కోపంతో ఈ 3 పనులు చేస్తే.. లక్ష్మీదేవి, విజయం దూరం!
కొత్తిమీర-చిన్న ఉల్లిపాయ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి బెస్ట్ కాంబో
కొత్తిమీర-చిన్న ఉల్లిపాయ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి బెస్ట్ కాంబో