AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒరే ఫ్లాష్ మాన్..  వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ

ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ

Phani CH
|

Updated on: Mar 09, 2026 | 1:33 PM

Share

అనంతపురంలో వింత చోరీ కలకలం రేపింది. కళ్యాణదుర్గం మెట్రో సూపర్‌మార్కెట్‌లో ఓ దొంగ సీసీ కెమెరాలకు చిక్కకుండా బట్టలు విప్పి నగ్నంగా దొంగతనం చేశాడు. ముఖానికి టవల్ చుట్టుకొని, ఒంటిపై బట్టలు లేకుండా రూ.40 వేల నగదు, ఖరీదైన సరుకులు దోచుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఈ దొంగ తెలివితేటలు చర్చనీయాంశమయ్యాయి.

దొంగలు సాధారణంగా ముఖానికి మాస్కులు ధరించి, లేదంటే ముఖం కనిపించకుండా టవల్‌ చుట్టుకొని చోరీలకు పాల్పడటం చూస్తుంటాం. కానీ అనంతపురం జిల్లాలో ఒక వింత దొంగ, సీసీ కెమెరాలో తన ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు ఏకంగా ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి దొంగతనానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ దొంగ తెలివితేటలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో ఉన్న ‘మెట్రో సూపర్ మార్కెట్’లోకి అర్ధరాత్రి ఒక దొంగ చొరబడ్డాడు. మొదట ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కట్టుకుని లోపలికి ప్రవేశించిన సదరు దుండగుడు, లోపల ఉన్న సీసీ కెమెరాలను గమనించాడు. తన ముఖం రికార్డు అవుతుందేమోనన్న భయంతో.. కట్టుకున్న టవల్‌ను తీసి ముఖం కనబడకుండా తలకు చుట్టుకున్నాడు. ఒంటిపై నూలుపోగు లేకుండానే సూపర్ మార్కెట్ అంతా కలియతిరిగిన ఆ దొంగ, అక్కడి క్యాష్ కౌంటర్లోని రూ. 40 వేల నగదుతో పాటు కొన్ని ఖరీదైన సరుకులను కూడా ఎత్తుకెళ్లాడు. ఈ వింత చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఉదయాన్నే షాపు తెరిచిన యజమాని చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీని చూసిన పోలీసులు కూడా ఆ దొంగ విన్యాసాలు చూసి అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. గుర్తుపట్టకూడదు అంటే బట్టలు విప్పేయాలా? ఏం తెలివితేటలు..అంటూ స్థానికులు సరదాగా చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు

ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే

Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??

వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే

సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్

Follow Us