సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్
లక్నోలో షాకింగ్ ఘటన: పైల్స్ శస్త్రచికిత్స చేయించుకున్న రైల్వే లోకో పైలట్ రాజేష్ మీనాకు చీఫ్ క్రూ కంట్రోలర్ సెలవు నిరాకరించారు. వైద్యులు సిఫార్సు చేసినా మొండిగా వ్యవహరించడంతో, రాజేష్ మీనా తన సర్జరీ గాయాన్ని అందరిముందూ చూపించాల్సి వచ్చింది. యూనియన్ నాయకుల జోక్యంతో సెలవు మంజూరైనా, అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది.
సెలవు మంజూరు చేయడంలో ఒక అధికారి ప్రదర్శించిన మొండితనం, ఒక రైల్వే ఉద్యోగిని అందరిముందూ ప్యాంటు విప్పేలా చేసింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్న రాజేష్ మీనా గత కొంతకాలంగా పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 22న ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఫిబ్రవరి 28 వరకు సెలవులో ఉన్న ఆయన, ఆపరేషన్ గాయం ఇంకా మానకపోవడంతో సెలవు పొడిగించాలని కోరారు. రైల్వే వైద్యులు కూడా ఆయనకు విశ్రాంతి అవసరమని ధృవీకరించారు. సెలవు మెమో కోసం రాజేష్ మీనా చీఫ్ క్రూ కంట్రోలర్ రతన్ కుమార్‌ను సంప్రదించారు. ఆపరేషన్ పత్రాలు, మందుల చీటీలు, ల్యాబ్ రిపోర్టులు అన్నీ చూపించినప్పటికీ.. ఆ అధికారి సెలవు ఇచ్చేందుకు నిరాకరించారు. తన అనారోగ్యాన్ని నమ్మడం లేదని ఆవేదన చెందిన రాజేష్ మీనా, ఆగ్రహంతో అక్కడే అందరి ముందూ ప్యాంటు విప్పి తన సర్జరీ గాయాన్ని అధికారికి చూపించారు. చివరకు రైల్వే యూనియన్ నాయకులు జోక్యం చేసుకోవడంతో ఆయనకు సెలవు మంజూరైంది. అయితే, అనారోగ్యంతో ఉన్న ఉద్యోగిని ఇలా అవమానించడంపై లోకో పైలట్స్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా
చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

