Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా
కోనసీమ జిల్లాలో 2.5 కిలోల భారీ బీట్రూట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. సాధారణం కంటే ఐదు రెట్లు పెద్దవైన ఈ 'బాహుబలి' దుంపలు మొగలికుదురులో కనిపించాయి. కర్ణాటక కోలార్ నుండి దిగుమతి అయిన వీటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాతావరణం, నేలలోని పోషకాల సమృద్ధి వల్లే ఇలాంటి అసాధారణ పెరుగుదల సాధ్యమని ఉద్యానశాఖ అధికారి తెలిపారు.
సాధారణంగా బీట్రూట్ దుంపలు ఎంత సైజు ఉంటాయి.. మహా అంటే ఒక్క దుంప అరకేజీ బరువు తూగుతూ కొంచెం ఆశ్చర్యపరుస్తాయి. కానీ అంతకు మించిన ఘటన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లాలో జరిగింది. ఇక్క ఓ రైతు పండించిన బీట్రూట్ దుంపలు ఏకంగా ఒక్కోటి రెండున్నర కిలోలు తూగుతోంది. ‘బాహుబలి’ సైజులో దర్శనమిస్తున్న ఈ బీట్రూట్ దుంపలు మామిడికుదురు మండలం మొగలికుదురులో హాట్ టాపిక్‌గా మారాయి. చిన్న సైజు కొబ్బరి బొండాలను తలపిస్తున్న ఈ దుంపలను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. స్థానిక కూరగాయల వ్యాపారి వుర్రింక రాఘవ దగ్గర ఈ భారీ బీట్రూట్లు కనిపించాయి. ఇవి కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుండి దిగుమతి అయినట్లు ఆయన తెలిపారు. సాధారణంగా మార్కెట్లో దొరికే దుంపల కంటే ఇవి ఐదు రెట్లు ఎక్కువ బరువు ఉండటంతో, కొనుగోలుదారులు, తోటి వ్యాపారులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంత భారీ పరిమాణంలో బీట్రూట్లు పెరగడంపై రాజోలు ఉద్యానశాఖ అధికారి దిలీప్ కుమార్ స్పందించారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించినప్పుడు, నేలలోని పోషకాలు సమృద్ధిగా అందినప్పుడు దుంప జాతి కూరగాయలు ఇలా అసాధారణ రీతిలో బరువు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఈ ‘బాహుబలి’ బీట్రూట్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూరగాయల మార్కెట్లో ఒకేసారి ఇంత పెద్ద దుంపలు కనిపించడంతో అంతా “వావ్” అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్
పిల్లలు లేరని భార్యను వేధించాడు.. అంతే.. భర్తను కత్తితో పొడిచి..
పుష్ప సినిమాకు మించిన స్కెచ్.. మామూలుగా లేదుగా!
వరదకు కొట్టుకొచ్చిన 23 కేజీల బాహుబలి చేప..
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

