Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! .. ప్రకాష్ రాజ్ మరో ట్వీట్

ప్రకాష్‌రాజ్.. తిరుపతి లడ్డూ విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ప్రకాష్‌ రాజ్‌వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ . శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు.

Prakash Raj: చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! .. ప్రకాష్ రాజ్ మరో ట్వీట్
Prakash Raj
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2024 | 4:52 PM

తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని.. దీనిపై కేంద్ర స్థాయిలో విచారణ చేపట్టాలని.. అదే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేంద్రంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్‌ చేశారు. దీనిపై ఎక్స్‌లో స్పందించిన ప్రకాష్‌రాజ్.. తిరుపతి లడ్డూ విషయాన్ని దేశ స్థాయిలో ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించారు. ప్రకాష్‌ రాజ్‌వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ . శ్రీవారి లడ్డూ అపవిత్రంపై తాను మాట్లాడితే ప్రకాశ్ రాజ్‌కు ఏం సంబంధమని పవన్ ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్ సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడని సూచించారు. తాను ఇంకో మతాన్ని నిందించలేదని, లడ్డూను అపవిత్రం చేయొద్దని చెబితే తప్పా అని ప్రశించారు. ప్రకాశ్ రాజ్ అంటే గౌరవం ఉందని, తన ధర్మంపై మాట్లాడొద్దంటే ఎలా అని పవన్ కల్యాణ్ నిలదీశారు.

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఏంటీ ఈమె మర్యాద రామన్న హీరోయినా..! ఎంత మారిపోయింది.!!

ఇక ఈక్రమంలోనే ప్రకాశ్‌ కూడా.. పవన్‌ మాటలపై ఓ కౌంటర్ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో.. పవన్‌ కళ్యాన్‌ ప్రెస్‌ మీట్‌ను ఇప్పుడే చూశానని చెప్పిన ప్రకాశ్‌ రాజ్‌.. తాను చెప్పింది కాకుండా.. పవన్‌ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను విదేశాల్లో ఉన్నాని.. వచ్చాక తన ట్వీట్‌ కు అర్థం ఏంటో చెబుతా అంటూ చెప్పారు. ఈలోపు టైం ఉంటే.. మరో సారి తన ట్వీట్ చదవాలంటూ పవన్‌ ను సెటైరికల్‌గా రెక్వెస్ట్ చేశారు ప్రకాశ్‌ రాజ్‌.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈ టాలీవుడ్ విలన్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి భర్తా.!!

అయితే అంతకు ముందుకు నటుడు కార్తీని ఉద్దేశించి కూడా పవన్ మాట్లాడారు. సినిమా ఫంక్షన్ లో లడ్డు గురించి మాట్లాడారు. అది కరెక్ట్ కాదు అని పవన్ సీరియస్  అయ్యారు. దానికి కార్తీ క్షమాపణలు కూడా చెప్పాడు. తాను ఉద్దేశపూర్వకంగా లడ్డు పై కామెంట్స్ చేయలేదు అని అన్నారు. దానికి పవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. డియర్ కార్తీ గారు, మన సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని అలాగే మీ దయను, వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంటూ పెద్ద పోస్ట్ షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. జస్ట్ ఆస్కింగ్ అని రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. మరి దీని పై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.