AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaddar Film Awards 2025 : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..

పాన్ ఇండియా లెవల్లో వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సత్తా చాటింది హీరోయిన్ రష్మిక మందన్నా. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు .. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఏడడుగులు వేసింది. ఇక తాజాగా తెలుగింటి కొత్త కోడలు గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

Gaddar Film Awards 2025 : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..
Rashmika Mandanna, Naga Cha
Rajitha Chanti
|

Updated on: Mar 07, 2026 | 12:57 PM

Share

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందిన సినిమాలకు ఈ అవార్డ్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే విలక్షణ నటి జయసుధ .. ఏఎన్నార్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రదానం చేయనున్నారు. చిన్న సినిమాలుగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి, ఛాంపియన్ సినిమాలు అత్యధిక అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. అలాగే తండేల్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా నాగచైతన్య ఎంపికయ్యారు. ఇక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గానూ ఉత్తమ నటిగా తెలంగాణ కొత్త కోడలు రష్మిక మందన్న ఎంపికైంది.

ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ చిరంజీవికి రాగా.. కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు దక్కడం విశేషం. గేయ రచయిత సుద్ధాల అశోక్ తేజకు సినారే అవార్డు వరించింది. రష్మిక విషయానికి వస్తే.. చాలా కాలంగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. పుష్ప 1, 2, యానిమల్, ఛావా, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. మరోవైపు రష్మిక చేతిలో వరుస మూవీస్ ఉన్నట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..

ఇదిలా ఉంటే.. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది రష్మిక మందన్నా. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఆమె.. ఫిబ్రవరి 26న విజయ్ తో కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేసింది. వీరిద్దరి వివాహ వేడుక రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో జరగ్గా.. మార్చి 4న హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించారు.

ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..

Follow Us
ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..
ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..
ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం..
ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో సమానం..
ఏంట్రా ఇది.. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల.. కొంచెం అయితే
ఏంట్రా ఇది.. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల.. కొంచెం అయితే
పొరపాటున కూడా ఈ రోజుల్లో బూట్లు కొనొద్దు.. ఈ తప్పులు చేస్తే..
పొరపాటున కూడా ఈ రోజుల్లో బూట్లు కొనొద్దు.. ఈ తప్పులు చేస్తే..
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
అమ్మకు పెళ్లి.. ఈ జంటకు ఎవరూ దిష్టపెట్టకూడదంటూ కూతురి పోస్ట్‌ వైర
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీకిక రక్త కన్నీరే
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..