AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..

తెలంగాణ జానపదాలు కొన్నాళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. రోజు రోజుకో కొత్త పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అలాగే ఎప్పుడో రిలీజ్ అయిన పాటలు ఇప్పటికీ నెట్టింటిని అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సత్తా చాటుతున్నాయి. అలాగే ఈ పాటలతో సినీరంగంలోకి అడుగుపెట్టినవారు ఉన్నారు.

Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‏నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..
Udukuduku Rottelu Song
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2026 | 8:59 AM

Share

ప్రస్తుతం యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. పల్లె పాటలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. గ్రామాల్లో సాధారణంగా అమ్మలక్కలు పాడుకునే పాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో పాటలు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. యూట్యూబ్‏లో మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకుంటూ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ ఫోక్ సాంగ్ మాత్రం ఏడాది క్రితం నెట్టింటిని శాసించింది. పరాయి మహిళ మాయలో పడిన భర్త కోసం ఓ ఇల్లాలు పడే ఆవేదనే ఈ సాంగ్. ఓ ఇల్లాలు బాధతో పాడే పాటే అయినా ఆ మ్యూజిక్ మాత్రం యూట్యూబ్‏లో ట్రెండ్ అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

“ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాద ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ..” ఈ సాంగ్ సోషల్ మీడియాను ఊపేసింది. ఈ పాటను తెలంగాణ ఫోక్ సాంగ్ రైటర్ జోగుల వెంకటేశ్ రాశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రచయితగా, గాయకుడిగా తన ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. జోగుల వెంకటేశం మాట్లాడుతూ.. “ఉడుకుడుకు రొట్టెలు” పాట విషయంలో, మొదట్లో దాని DJ మ్యూజిక్ శైలి గురించి సందేహపడ్డామని.. తన సన్నిహితుల ప్రోత్సాహంతో దానిని రూపొందించినట్లు తెలిపారు. ఒక చిన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా అది రెండు మూడు రోజుల్లోనే వైరల్‌గా మారి, ప్రమో ఒక మిలియన్, పూర్తి పాట ఒక రోజులో ఒక మిలియన్ వ్యూస్ సాధించి, చివరకు 38 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు తెలిపారు. అయితే, ఈ విజయం వెనుక కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

తన పాటలను డీజే రీమిక్స్ చేసేటప్పుడు, దాని ద్వారా వచ్చే ఆదాయం తమకు చేరకపోవడం పట్ల వెంకటేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో హక్కుల సమస్యలు ఉన్నాయని, కానీ దాన్ని పరిష్కరించడానికి ప్రస్తుతం మార్గం లేదని వివరించారు. తన కెరీర్ ప్రారంభంలో, కుటుంబ సభ్యులు వ్యవసాయంపై దృష్టి పెట్టమని, పాటలు అనవసరం అని అన్నారని.. దుబాయి నుంచి తిరిగి వచ్చిన తర్వాత “పోరిని కసికైనా” అనే పాటతో తన ప్రయాణాన్ని ప్రారంభించి, క్రమంగా పేరు సంపాదించుకున్నానని తెలిపారు. “మా గల్లీలో ఒక్కడు పోరడు”, “శనిగసేననిలా” వంటి పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన తల్లికి ఇష్టమైన పాట “నెల్లు నెల్లురికాడ కల్లుకా” అని ఆయన తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

Follow Us