AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం పిచ్చి ప్రేమ.. ఇన్‌స్టాలో అది అడిగాడని.. లవర్ ఏం చేసిందో తెలుసా..?

సోషల్ మీడియా యుగం.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. అంతా డిజిటల్ కనికట్టు మాదిరిగా మారిపోయింది.. సోషల్ మీడియా.. ప్రేమలు.. ఆ తర్వాత పారిపోవడాలు.. పెళ్లిళ్లు.. చివరకు ఎన్నో క్రైమ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో.. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోషల్ మీడియా పరిచయం వివిధ పరిణామాలకు ఎలా దారి తీస్తుందో చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదేం పిచ్చి ప్రేమ.. ఇన్‌స్టాలో అది అడిగాడని.. లవర్ ఏం చేసిందో తెలుసా..?
Love
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 1:19 PM

Share

సోషల్ మీడియా యుగం.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. అంతా డిజిటల్ కనికట్టు మాదిరిగా మారిపోయింది.. సోషల్ మీడియా.. ప్రేమలు.. ఆ తర్వాత పారిపోవడాలు.. పెళ్లిళ్లు.. చివరకు ఎన్నో క్రైమ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో.. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోషల్ మీడియా పరిచయం వివిధ పరిణామాలకు ఎలా దారి తీస్తుందో చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం ఒక యువతి తన తల్లి బంగారాన్ని దొంగిలించి అమ్మి అతనికి ఖరీదైన బైక్ కొనిచ్చిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ సమయంలో ఆ యువకుడు తనకు ఖరీదైన బైక్ కొనివ్వాలని యువతిని కోరాడు. ప్రియుడి కోరిక తీర్చాలని భావించిన యువతి.. దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంట్లో దాచుకున్న తన తల్లి బంగారాన్ని రహస్యంగా తీసుకుని విక్రయించింది. ఆ డబ్బులతో ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చింది.

కొంతకాలం తర్వాత ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి వెతికినా దొరకలేదు. అనంతరం విషయాన్ని తెలుసుకున్న ఆమె పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇంట్లో ఉన్న బంగారాన్ని యువతి.. అమ్మి ప్రియుడికి బైక్ కొనిచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా పరిచయాల కారణంగా యువతులు ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
పుట్టగొడుగులు త్వరగా బూజు పడుతున్నాయా?ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
ఆసియా గేమ్స్‌లో నాలుగో పతకం కైవసం..!
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
మహేష్ బాబు పిన్నీ ఈ తెలుగు నటికి మేనత్త అని తెలుసా..
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు
గణేశుని లడ్డూను రూ.1.45 లక్షలకు దక్కించుకున్న ముస్లిం దంపతులు