AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSLPRB పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్ష జీతం!

పోలీస్ శాఖలో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో 2026 ఆగస్టు 19 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు..

TSLPRB పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్ష జీతం!
TSLPRB ASI Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 07, 2026 | 4:16 PM

Share

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్ట్ 19, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

SCT అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి కింది విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగం/స్పెషలైజేషన్‌లో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా డిగ్రీ (సీఏ) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అధిక విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వరకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లకు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

తెలంగాణ పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈ అర్హతలు కలిగిన వారు సెప్టెంబర్ 9, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకుని, దరఖాస్తు ఫీజు చెల్లించిన అనంతరం ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సమర్పించాలి. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.750, ఇతర అభ్యర్థులు రూ.1500 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష, ఫైనల్ మెరిట్ జాబితా ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష ఉండదు. PMT, PETలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ఫైనల్ మెరిట్ పేపర్ 2, పేపర్ 3 మార్కుల ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.33,750 నుంచి రూ.99,310 వరకు వేతనం లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఆగస్టు 19, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 9, 2026.
  • రాత పరీక్ష తేదీలు: త్వరలోనే ప్రకటిస్తారు.

తెలంగాణ పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us