Cinema : ఆ సినిమా షూటింగ్ టైంలో నిజంగానే టీవీ పేలిపోయింది.. ఆ రోజు పరిస్థితి దారుణం.. డైరెక్టర్ కామెంట్స్..
ప్రముఖ దర్శకుడు ఎం.వి. రఘు ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ షాకింగ్ సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే డైరెక్టర్ వంశీ సినిమాల ప్రత్యేకతను.. ఆయన దర్శకత్వ శైలిని గుర్తుచేసుకున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు ఎం.వి. రఘు ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా వంశీ దర్శకత్వంలో వచ్చిన ఏప్రిల్ 1 విడుదల చిత్రం గురించిన మర్చిపోలేని జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో జరిగిన ఒక షాకింగ్ టీవీ పేలుడు సంఘటనతో పాటు, వంశీ ప్రయోగాత్మక ఆలోచనలు, నటీనటులు శోభన, కృష్ణ భగవాన్ గురించి వివరించారు. ఏప్రిల్ 1 విడుదల సినిమాలోని “వాళ్ళిద్దరూ” పాట గురించి రఘు మాట్లాడుతూ.. ఫ్లాట్ లోపల వర్షం పడినట్లు చూపించిన రెయిన్ ఎఫెక్ట్ వంశీ సృజనాత్మకతకు నిదర్శనమన్నారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటలో ఫ్యూజన్ మ్యూజిక్‌తో కూడిన ర్యాప్ స్టైల్ సంభాషణలు ఆనాటి ప్రయోగాలకు అద్దం పట్టాయని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‌నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..
షూటింగ్‌లో పైరోటెక్నిక్స్ కోసం మద్రాస్ నుండి రావాల్సిన నిపుణుడు అందుబాటులో లేకపోవడంతో, అనుభవం లేని ఒక యువకుడిని పంపించారట. ఆ యువకుడు టీవీ పేల్చేందుకు అధిక మోతాదులో పేలుడు పదార్థాన్ని వాడటంతో, టీవీ అధిక శక్తితో పేలి దాని ముందున్న ప్లాస్టిక్ అద్దం వేగంగా కెమెరా వైపు దూసుకువచ్చింది. అదృష్టవశాత్తు, తాను కెమెరాను పక్కకు జరపడంతో లెన్స్ దెబ్బతినడమే కాకుండా, పెను ప్రమాదం తప్పిందని. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Ravi Teja : రవితేజ తింటుంటే ఆ ప్రొడ్యుసర్ దారుణంగా అవమానించాడు.. ఎలా దెబ్బకొట్టాడంటే..
అలాగే, ఏప్రిల్ 1 విడుదల చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన మరో విచిత్రమైన సంఘటనను రఘు వివరించారు. సాధారణంగా షాపు ప్రారంభోత్సవాలకు రిబ్బన్ కట్ చేస్తారని. అయితే వంశీ మాత్రం, ఓ పెద్ద దొంగ (తాళం) తీసుకువచ్చి, ఇళయరాజా సంగీతంలో ఓ రంపంతో దాన్ని కోసే దృశ్యాన్ని చిత్రీకరించారట. దురదృష్టవశాత్తు, దొంగ తెగిపడినప్పుడు దాన్ని కోస్తున్న నటుడు రామకృష్ణ కాలు మీద పడి రెండు నెలలు కుంటుకుంటూ నడిచాడని ఆయన తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆశాపాశం సాంగ్ రాసింది నేనే.. కానీ అతడు సాంగ్ నా కెరీర్ మలుపు తిప్పింది.. లిరిసిస్ట్..
