AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదికదా ప్రజాసేవంటే.. ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు

సాధారణంగా సర్పంచ్‌గా ఎన్నికైన వారు ఎలా ఉంటారు. వైట్ అండ్ వైట్ వేసి డ్రెస్‌కోడ్‌తో, వెనకాల 10 మంది అనుచరులతో కాస్‌టీ కార్లలో తిరుగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడో సర్పంచ్ మాత్రం వారందరికీ భిన్నంగా తన హోదాను పక్కనపెట్టి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. నిత్యం మురుగు కాల్వల్లోంచి తీసే చెత్తను తరలించే ట్రాక్టర్ల నడుపుతూ సర్పంచ్ అంటే ఏసీ గదుల్లో కూర్చుని సంతకాలు పెట్టడం కాదు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం అని నిరూపిస్తున్నారు.

Telangana: ఇదికదా ప్రజాసేవంటే.. ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు
Regonda Sarpanch Vineesh
P Shivteja
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 1:27 PM

Share

అప్పటి వరకు సాధారణంగా ఉన్న వ్యక్తి సైతం ఒక్కసారి సర్పంచ్‌గా గెలిస్తే తమ రూపురేఖలనే మార్చుకుంటారు. కానీ ఇక్కడో సర్పంచ్‌ మాత్రం అందుకున్న బిన్నంగా గ్రామపంచాయతీ కార్మికునిగా మారి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ గ్రామ ప్రజలతో మమేకమై తానే గ్రామపంచాయతీ పారిశుద్ధ ట్రాక్టర్ డ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికునిగా మారాడు. ఇల్లు ఇల్లు తిరుగుతూ చెత్తను సేకరిస్తూ తడి, పొడి చెత్త పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామసర్పంచ్ వినీష్‌.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామానికి చెందిన వినీష్ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంగ్‌గా ఎన్నికయ్యారు. తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సర్పంచ్ అంటే సంతకాలు పెట్టేవాడు కాదని గ్రామంలో ఏ సమస్య ఉన్న తానే ముందుండి నడిపించేవాడని నిరూపిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం గ్రామంలో తానే గ్రామపంచాయతీ ట్రాక్టర్ నడుపుతూ పారిశుద్ధ్య కార్మికునిగా మారి ఇల్లు ఇల్లు తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నాడు. గ్రామస్తులకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను సైతం తీస్తూ అందరి మన్నలను అందుకుంటున్నాడు. గ్రామంలో ఏచిన్న సమస్య వచ్చినా అన్నితానై ముందుండి నడిపిస్తున్నాడు. తాను ప్రజాసేవ కోసం సర్పంచ్ గా గెలిచానని.. ఎప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉండి వారికి సేవ చేయడమే తన ధ్యేయమంటున్నాడు సర్పంచ్ వినీష్

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు
ఆ సర్పంచ్ పనితీరుకు సలాం కొడుతున్న గ్రామస్థులు
ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు..?
ఇనుముతో తయారైన రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు..?
ఏంటక్కా ఇలా తయారయ్యారు.. లవర్ కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
ఏంటక్కా ఇలా తయారయ్యారు.. లవర్ కోసం ప్రియురాలు ఏం చేసిందంటే..
సంజూ @ 26.. టీమిండియా విజయాన్ని అడ్డుకునే మొనగాడు ఉన్నాడా..?
సంజూ @ 26.. టీమిండియా విజయాన్ని అడ్డుకునే మొనగాడు ఉన్నాడా..?
ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు..
ఆ చెత్త సినిమా ఎందుకు చేశారు సర్.! ఓపెన్‌గా అడిగేసిన బిచ్చగాడు..
ఆ రోజు పరిస్థితి దారుణం..షూటింగ్ టైంలో టీవీ పేలిపోయింది.
ఆ రోజు పరిస్థితి దారుణం..షూటింగ్ టైంలో టీవీ పేలిపోయింది.
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్..
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన పవర్ఫుల్ ఉమెన్స్..
సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల..
సమ్మర్‌లో అదిరే బిజినెస్.. కేవలం 3 నెలలు కష్టపడితే రూ.3 లక్షల..
IND vs NZ: ఒకే దెబ్బకు 3 భారీ ప్రపంచకప్ రికార్డులు.. అవేంటంటే?
IND vs NZ: ఒకే దెబ్బకు 3 భారీ ప్రపంచకప్ రికార్డులు.. అవేంటంటే?
నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స..దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌లో
నిమిషాల్లోనే మెదడు గడ్డలకు చికిత్స..దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌లో