Mohammed Shami: చాలా రోజుల తర్వాత కూతురిని కలుసుకున్న మహ్మద్‌ షమీ.. సరదాగా షాపింగ్ చేస్తూ.. వీడియో

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన షమీ.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా అసలు మైదానంలోకి అడుగు పెట్టలేదీ సీనియర్ ఫాస్ట బౌలర్

Mohammed Shami: చాలా రోజుల తర్వాత కూతురిని కలుసుకున్న మహ్మద్‌ షమీ.. సరదాగా షాపింగ్ చేస్తూ.. వీడియో
Mohammad Shami
Follow us

|

Updated on: Oct 04, 2024 | 3:08 PM

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన షమీ.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రపంచకప్ తర్వాత గాయం కారణంగా అసలు మైదానంలోకి అడుగు పెట్టలేదీ సీనియర్ ఫాస్ట బౌలర్. దాదాపు ఏడాది కాలంగా అతను క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు షమీ. కొన్ని కారణాలతో భా ర్య హసీన్ జహాన్ తో విడిపోయాడు. ఈ నేపథ్యంలో కూతురు ఐరాను కూడా చాలా రోజుల పాటు కలుసుకోలేకపోయాడు. దీనిపై పలు సార్లు ఎమోషనల్ అయ్యాడీ టీమిండియా పేసర్. అయితే చాలా రోజుల తర్వాత మహ్మద్ షమీ తన కూతురు ఐరాను కలిశాడు.   తనతో పాటు షాపింగ్‌కు వెళ్లిన షమీ ఆమెకు ఇష్టమైన వాటన్నింటినీ దగ్గరుండి మరీ కొనిచ్చాడు. అనంతరం తన కూతురితో గడిపిన ఆనంద క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశాడు షమీ. ఇందులో షాపింగ్ మాల్ లో షమీ, ఐరా కలియ తిరగడం చూడచ్చు. అలాగే ఐరాకు ఇష్టమైన దుస్తులు, షూస్ దగ్గరుండి మరీ కొనియ్వడం గమనించవచ్చు. కాగా మహ్మద్ షమీ తన కుమార్తెను కలవడంపై ఎమోషనల్ అయ్యాడు షమీ. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశాడు. ‘ చాలా రోజుల తర్వాత నా కూతురిని కలిశాను. తను చాలా పెద్దదిగా అయిపోయింది’ అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు షమీ.

ఇవి కూడా చదవండి

కాగా మహ్మద్ షమీ అతని భార్య ఇటీవల తన ఫిట్‌నెస్ పై అప్‌డేట్ ఇచ్చాడు. త్వరలో క్రికెట్ ఫీల్డ్‌కి తిరిగి రావడానికి కష్టపడుతున్నానని చెప్పాడు. అతను తొందరపడకూడదనుకుంటున్నాడు. మహ్మద్ షమీ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అంటే ఎన్‌సీఏలో ఉన్నాడు.  నవంబర్‌లో భారత్‌ ఆస్ట్రేలియా టూర్‌ ప్రారంభం కానుంది. దీనిపైనే షమీ దృష్టంతా ఉంది. ఆస్ట్రేలియాలో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఇది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భాగం.

కూతురితో కలిసి షాపింగ్ చేస్తోన్న మహ్మద్ షమీ.. వీడియో ఇదిగో..

అంతర్జాతీయ క్రికెట్‌లో షమీ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే.. అతను తన కెరీర్‌లో ఇప్పటివరకు 64 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 229 వికెట్లు తీశారు. అలాగే 23 టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు మహ్మద్ షమీ అభిమానులు కూడా ఆ క్రికెటర్‌ని మైదానంలో చూడాలనుకుంటున్నారు. బౌలర్ మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని కూడా వారు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక