AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. డిజిటల్ కంటెంట్ హబ్‌గా హైదరాబాద్‌..12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం

నెటిక్స్ స్టూడియోస్ హైదరాబాద్‌లో భారీ కార్యాలయాన్ని ప్రారంభించడం AVGC రంగానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, అంతర్జాతీయ ఓటీటీ కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్ పనులకు వేదిక కానుంది. ముఖ్యంగా, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. హైదరాబాద్‌ను డిజిటల్ కంటెంట్ తయారీ కేంద్రంగా మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది కీలక అడుగు.

నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. డిజిటల్ కంటెంట్ హబ్‌గా హైదరాబాద్‌..12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం
Netflix Studios Expands in Hyderabad
Prabhakar M
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 1:47 PM

Share

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఓటీటీ కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పనిచేస్తున్న నెటిక్స్ స్టూడియోస్ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుంది. సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యాలయాన్ని ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.

భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఈ విస్తరణకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ముంబయిలో కార్యాలయం నిర్వహిస్తున్న నెటిక్స్‌కు, హైదరాబాద్ కేంద్రం దేశంలో రెండో ప్రధాన కార్యాలయంగా నిలవనుంది.

ఈ పెట్టుబడితో హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ (AVGC) రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

అలాగే అడ్వాన్స్‌డ్ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా AVGC రంగంలో నైపుణ్యాభివృద్ధికి కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్‌ను డిజిటల్ కంటెంట్ తయారీ కేంద్రంగా మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోనే అనేక అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. వార్నర్ బ్రదర్స్, డిస్నీ, స్కైలైన్ వీఎఫ్ఎక్స్, బార్న్‌స్టార్మ్ వీఎఫ్ఎక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఉబిసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పటికే నగరంలో పనిచేస్తున్నాయి.

ఇక హాలీవుడ్ సినిమాల్లో విస్తృతంగా ఉపయోగించే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ‘ఎం అండ్ ఎం క్యాప్ ల్యాబ్’ ఈ రంగానికి కొత్త అవకాశాలను తెరవనుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి పక్కా కొలతలతో జొన్న దోశలు
అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
అగ్రిగోల్డ్‌ బాధితులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
శని సంచారం.. ఏలినాటి శని ఉన్న రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్