AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ

దీపావళి పండుగ సమయంలో చాలా మంది స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారు. అయితే తక్కువ బడ్జెట్‌లో అదిపోయే విధంగా టేస్టీ టేస్టీ స్వీట్ తయారు చేసుకోవాలి అనుకునే వారికి బ్రెడ్ హల్వా చాలా బెటర్ అని చెప్పాలి. చాలా తక్కువ సమయంలో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చును. అంతే కాకుండా కుటుంబం మొత్తం కూడా దీనిని ఆనందంగా తినవచ్చు.

Samatha J
|

Updated on: Oct 29, 2026 | 4:09 PM

Share
కాగా, ఇప్పుడు మనం బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో చూసేద్దాం. బ్రెడ్ స్లైసెస్ - 8,  నెయ్యి - 1 టేబుల్ స్పూన్ (డ్రై ఫ్రూట్స్ వేయించడానికి), ఆయిల్ - బ్రెడ్ వేయించడానికి సరిపడా,  పంచదార - 1 కప్పు, నీరు - 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌) - 2-3 టేబుల్ స్పూన్లు,  యాలకుల పొడి - 1/2 టీ స్పూన్,  కుంకుమ పువ్వు - చిటికెడు (ఐచ్ఛికం),  కాచి చల్లార్చిన పాలు - 1/4 కప్పు.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. బ్రెడ్ హల్వా కోసం,  బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. వాటి అంచులను జాగ్రత్తగా కట్ చేసి, కేవలం మధ్యలోని భాగం మాత్రమే తీసుకోవాలి. దానిని నాలుగు ముక్కలు సమానంగా కట్ చేయాలి. ఇలా తీసుకోవడం వలన బ్రెడ్ హల్వా పర్ఫెక్ట్‌గా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టండి. అందులో నూనె పోసి, నూనె బాగా వేడి అయ్యాల చూసుకోవాలి.

2 / 5
 నూనె వేడయ్యాక, మంటను తక్కువ నుండి మధ్యస్థ స్థాయికి తగ్గించండి. బ్రెడ్ ముక్కలను ఒకేసారి ఎక్కువ వేయకుండా, ఐదు లేదా ఆరు ముక్కలను వేసి, రెండు వైపులా తిప్పుతూ బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అధిక మంటపై వేయిస్తే బయట కాలి లోపల సరిగా వేగవు, తక్కువ మంటపై వేయిస్తే నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. వేగిన బ్రెడ్ ముక్కలను నూనె నుండి తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ పై పాన్ పెట్టాలి. అందులో  1 కప్పు పంచదారకు 1 కప్పు నీటిని కలపాలి. తర్వాత మధ్యస్థ మంటపై పంచదార పూర్తిగా కరిగే వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. పంచదార కరిగిన తర్వాత, మంటను తక్కువ చేసి గులాబ్ జామ్ కంటే కాస్త ముదురు పాకం వచ్చిందో చూసుకోవాలి. అలా వస్తే పాకం సిద్ధమైనట్లే.

4 / 5
ఇప్పుడు అందులో కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి . తర్వాత  వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను పాకంలో వేసి, బాగా కలపాలి. పాకంలో బ్రెడ్ మొత్తం ఉడికే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత చివర్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. అంతే టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ.

5 / 5
Follow Us